జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదుశిక్షలతోనే సమాజంలో మార్పు.మూడు కేసులలో గౌరవ కోర్టు ఈ రోజు వెల్లడించిన తీర్పులలో ఒకరికి జీవిత ఖైదు, ఒకరికి 07 సంవత్సరాల జైలు శిక్ష, ఒకరికి 01 సంవత్సరం జైలు శిక్ష, ఒకరికి 01 సంవత్సరం జైలు శిక్ష.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ రోజు గౌరవ కోర్ట్ తీర్పు వెల్లడించిన కేసుల వివరాలు.

 Sp Akhil Mahajan Said That Those Who Have Committed Crimes In The District Must-TeluguStop.com

1.హత్య కేసులో వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టెముల గ్రామానికి చెందిన బారాజు మల్లారెడ్డి కి జీవిత ఖైదు , 5000/- రూపాయల జరిమాన,బారాజు నరసింహారెడ్డి కి 07 సంవత్సరాల జైలు శిక్ష,3000/- రూపాయల జరిమాన విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత బుధవారం తీర్పు వెల్లడించారు.

వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామానికి చెందిన బారాజు మల్లారెడ్డి , నరసింహా రెడ్డి, ఎమిరెడ్డి రాంరెడ్డి , కనక రెడ్డి ,లచ్చి రెడ్డి అను వారికి చాలా కాలం గా భూమి తగాదాలు ఉన్నందున ఈ క్రమంలో భారాజు మల్లారెడ్డి, తండ్రి నరసింహారెడ్డి ఇద్దరు కలసి 2015-05-25 తేదీన సాయంత్రం ఏమిరెడ్డి రాంరెడ్డి, అతని కుమారులు అయిన కనక రెడ్డీ , లచ్చిరెడ్డిలపై దాడి చేయగా రాంరెడ్డి స్పృహ కోల్పోగా, కనకారెడ్డి , లచ్చిరెడ్డీ లకు గాయాలు కాగా వారిని అక్కడ ఉన్నవారు వెంటనే వారిని కరీంనగర్ హాస్పిటల్ నందు చికిత్స చేయించారు.రాంరెడ్డి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తీసుకెళ్లాలి అని సూచించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్య లో రాంరెడ్డి చనిపోయాడు.

వేములవాడ పోలీసులు కేసు నమోదు చేసి బారాజు మల్లారెడ్డి,నరసింహా రెడ్డి ని రిమాండ్ కు తరలించారు.అప్పటి సీ.ఐ శ్రీనివాస్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.ఈకేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సింగరావు వాదించగా కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కానిస్టేబుల్లు నరేందర్, రమేష్ లు కోర్టులో 17 మంది సాక్షులను ప్రవేశపెట్టగా పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితులకి బారాజు మల్లారెడ్డి కి జీవిత ఖైదు,5000 రూపాయల జరిమానా,బారాజు నరసింహ రెడ్డికి 07 సంవత్సరాల జైలు శిక్ష,3000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు తెలిపారు.

2.కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసులో గంగుల రమేష్ అనే నిందితునికి ఒక సంవత్సరం జైలు శిక్ష 1100/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జి రాధిక జైస్వాల్ తీర్పు వెల్లడించారు.

కొనరావుపేట్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన గంగుల రమేష్ s/o పర్శరములు అనే వ్యక్తి 2018 సంవత్సరంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనిలో భాగంగా టిప్పర్ డ్రైవర్ గా పనిచేసేవాడు.

రెండు నెలలు పనిచేసిన తర్వాత అట్టి వ్యక్తి ప్రవర్తన బాగాలేక ప్రాజెక్టు పనులకు చెడ్డ పేరు వస్తుందని ఉద్దేశంతో అతని విధులనుండి తీసివేయడం జరిగింది.అట్టి విషయాన్ని గంగుల రమేష్ మనసులో పెట్టుకొని ప్రాజెక్టు మెనేజర్ చేకూరి కృష్ణంరాజు ని చంపాలని ఉద్దేశంతో తన వద్ద ఉన్న స్కూల్ డ్రైవర్ దాడి చేయగా కొనరావుపేట్ పోలీస్ స్టేషన్ లోప్రాజెక్టు మెనేజర్ చేకూరి కృష్ణంరాజు పిర్యాదు మేరకు అప్పటి ఎస్.ఐ పర్శరములు కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించి కోర్టు లో ఛార్జ్ షీట్ దాకాలు చేశారు.ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల లక్ష్మీప్రసాద్ వాదించగా కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ రవీంద్ర నాయుడు, సి ఎం ఎస్ హెడ్ కానిస్టేబుల్ శంకరయ్య, కోర్టు కానిస్టేబుల్ లతీఫ్ ల ఆధ్వర్యంలో 10 మంది సాక్షులను ప్రవేశపెట్టగా పూర్వపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రోజు కావడంతో నిందితునికి 01 సంవత్సరం జైలు శిక్ష ,1100/- రూపాయల జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు.

3.బార్య పై కిరోసిన్ పోసి హత్యా ప్రయత్నం చేసిన కేసులో నిందుతునికి ఒక సంవత్సరం జైలు శిక్ష తోపాటు 100/-రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రాధిక జైశ్వాల్ బుధవారం తీర్పు వెల్లడించారు.

సిరిసిల్ల పట్టణం చంద్రంపేటకి చెందిన కావాలి రాజు అనే వ్యక్తి తన యొక్క భార్య కావలి లక్ష్మి కి పిల్లలు కావటం లేదని తరచూ తాగి వచ్చి తనని మానసికంగా,శారీరకంగా హింసించేవాడు.26.05.2019 నాడు తన బార్య ను చంపుతా అని తన పై గ్యాస్ నూనె పోసినాడు అందుకు లక్ష్మి నువ్వు చంపేది ఏంది అని తను అగ్గిపెట్టె తో అంటించుకోగా వెంటనే తన భర్త అయిన రాజు నల్ల కిందకు తీసుకుపోయి నీళ్ళు చల్లి హాస్పిటల్ కు తీసుకువెళ్ళాడు.ఈ ఘటన పై సిరిసిల్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కావాలి రాజు పై కేసు నమోదు చేసి అప్పటి ఎస్.ఐ శ్రీనివాస రావు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు .సిఎం ఎస్.ఎస్.ఐ రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ మహేందర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.ప్రాసిక్యూషన్ తరపున పి.పి లక్ష్మి ప్రసాద్ వాదించగా కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి రాధిక జైశ్వాల్ నిందుతుడు అయిన కావలి రాజుకి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు 100/- రూపాయలు జరిమానా విధించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు, ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.పై మూడు కేసులో నిందితులకి శిక్ష పడటం లో కృషి చేసిన పీపీ లు వేముల లక్ష్మి ప్రసాద్ ,నర్సింగరావు లను సి ఎం ఎస్ ఎస్.ఐ రవీంద్రనాయుడు, కోర్ట్ కానిస్టేబుల్ లు రమేష్, మహేందర్, లతీఫ్, సి ఎం ఎస్ హెడ్ కానిస్టేబుల్స్ శంకర్, కానిస్టేబుల్ నరేందర్,లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube