రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీ.జీ.
ఓ.) 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.(టీజీఓ) ల ఆద్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను రూపొందించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, టీజీఓ యూనియన్ కార్యవర్గ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.కార్యక్రమంలో టీజీఓ అధ్యక్షులు సమర సేన్ దేవానంద్, కార్యదర్శి ఎస్ డీ జబీ ఉల్లా, జిల్లా అధికారుల సంఘం ( డోర్స్) అధ్యక్షులు రవీందర్ రెడ్డి,కార్యదర్శి శేషాద్రి,సహ అధ్యక్షులు జోగం రాజు, కోశాధికారి అహ్మద్ రసూల్, ఉప అధ్యక్షులు అంజి రెడ్డి, అబ్దుల్ వాజీద్, జాయింట్ సెక్రటరీలు శ్రీకాంత్, చంద్రకళ, అనిల్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాగర్, ప్రచార కార్యదర్శి వి.శ్రీధర్, క్రీడల కార్యదర్శి లక్ష్మణ్ , కార్యవర్గ సభ్యులు కవిత, వినయ్ ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.