రాజన్న సిరిసిల్ల జిల్లా: సావిత్రిబాయి పూలే జయంతి సంధర్భంగా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో దేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు, సమాజ సేవకురాలుగా దేశంలోనే పేరుగాంచిన మహిళామూర్తి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నివాళులు అర్పించి, కళాశాల విద్యార్థినులకు లెక్చరర్ల ఆధ్వర్యంలో సాయంకాల అల్పాహార పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్ విధ్యాధికారి (డిఈఐఓ) వై.
శ్రీనివాస్, ముఖ్య అథితిగా మున్సిపల్ కమీషనర్ కుమారి డి.లావన్య, ప్రత్యేక అథితిగా వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జిల్లా అధికారి,కళాశాల ప్రిన్సిపాల్ డి.వనజా కుమారి మాట్లాడుతూ రానున్న పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచి కళాశాలలో అధిక సమయం కేటాయించి స్టడీ అవర్స్ ప్రతిరోజు ఒక గంట ఎక్కువగా కళాశాలలోనే ఉండి చదవాలని కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులందరు కలిసి పరీక్షల వరకు అల్పాహారం ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకొని బాగా చదివి కళాశాలకు గొప్ప పేరు తేవాలని తెలిపారు.కళాశాల అధ్యాపకులు సీతారాము, సయ్యద్ జబీ,మురళీ,ప్రవీన్ కుమార్,శ్రీనివాస్, గంగరాజు, కె.సునీతా,ఎం .సునీత,అఫ్రోజ, అనితా, భుాపాల్, ఆఫీస్ స్టాఫ్ స్వప్న, రహీమ్, ప్రకాశ్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.అనంతరం జాతీయ మహిళాధ్యాపకుల దినోత్సవ సంధర్బంగా ప్రిన్సిపాల్ మేడం కి, మహిళాధ్యాపకులకు కళాశాల తరపున సన్మానించడం జరిగింది.