రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో గురువారం ఎంపీటీసీ లేగల శ్రీనివాసరెడ్డి తండ్రి పాపిరెడ్డి రెండు రోజుల క్రితం మృతిచెందగా వారి కుటుంబాన్ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు.రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో మాజీ ఉపసర్పంచ్ మాదారపు సుధాకర్ రెడ్డి తల్లి మల్లవ్వ గురువారం మృతిచెందగా వారి కుటుంబాన్ని కూడా పరామర్శించారు.
అదేవిధంగా సింగారం గ్రామంలో మహబూబ్ అమ్మమ్మ అభేదా మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.
అలాగే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బద్ది బాలవ్వ, జేరిపోతుల నరసవ్వ లు మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించారు.
పరామర్శించిన వారిలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు రాజు నాయక్, నాయకులు కొండాపురం శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి, వాసరవేని దేవయ్య, ఎండి ఇమామ్ ,ఎస్కే గౌస్, చెన్ని బాబు, బిపేట రాజు, గోపాల్ పాల్గొన్నారు
.






