రాజన్న సిరిసిల్ల జిల్లా: స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసి, దేశంలోనే తొలి బాలికల పాఠశాల ప్రారంభించి, బాల్య వివాహాలపై అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే జయంతిని తెలంగాణ ప్రభుత్వం జనవరి, 3న అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థుల భవిషత్తుకు తమ వంతుగా విద్యాబుద్ధులు నేర్పుతున్న మహిళా టీచర్లను ఈ సందర్భంగా సన్మానించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ బాలికల పాఠశాలలో పనిచేసే మహిళా ఉపాధ్యాయులు టి.మాధవి, కె.రాధిక, సీ.హెచ్.అరుంధతి, ఏ.సరళ, టి.సరిత, ఎన్.స్వాతి లను ఈ రోజు మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేయడం జరిగిందని
ట్రస్టు నిర్వాహకులు మధు, మహేష్ అన్నారు.ట్రస్టు సభ్యులు డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పడడమే కాక వారు చెడు మార్గాల్లో ప్రయాణించకుండా సక్రమ మార్గంలో పయనించేలా పలుసూచనలు చేస్తూ, మంచిబాటలో పయనించేలా కృషి చేస్తున్న ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని,ఈ సందర్భంగా ఉపాధ్యా యుని ఉపాధ్యాయులకు అభినందనలు తెలియ జేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి బి.బన్నాజి తో పాటు పాఠశాల సిబ్బంది, ట్రస్టు సభ్యులు మధు మహేష్, నగుబోతు రవీందర్, డాక్టర్.బెజ్జంకి రవీందర్, గొంగళ్ళ రవికుమార్, పొలాస రాజేందర్, తోట రాజు, పసుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.