కొడుకు లేని లోటు తీర్చిన కూతురు.. కన్న తల్లికి అంతిమ సంస్కారాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా : హిందూ సాంప్రదాయం ప్రకారం కొడుకే చితికి నిప్పు పెట్టాల్సి ఉంటుంది.కానీ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ పేదింటి ఆడబిడ్డ తన కన్న తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించి రుణం తీర్చుకున్న ఘటన బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

 A Daughter Who Made Up For The Lack Of A Son The Last Rites Of A Mother, Daught-TeluguStop.com

వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన

భల్ల సత్తవ్వ ( 85 ) అనే నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధురాలు బుధవారం ఆనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె పెద్ద బిడ్డ ఇప్పలపల్లి ప్రభావతి అంతిమ సంస్కారాలు నిర్వహించి చితికి నిప్పంటించిన ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.కొడుకు లేని రుణాన్ని తీర్చుకున్న బిడ్డ ప్రభావతి ని చూసి పద్మశాలి సేవా సంఘం వారు , గ్రామస్తులు అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube