హనుమాన్ సినిమాతో( Hanuman ) ఒక్కసారిగా పెను ప్రభంజనాన్ని సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.( Prashanth Varma ) ఇక ఇప్పుడు జై హనుమాన్( Jai Hanuman ) అనే సినిమాని తీస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచానలైతే ఉన్నాయి.ఇక ఈ సినిమాను కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమా విషయంలో ప్రశాంత్ వర్మ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా క్లారిటీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా తర్వాత ఆయన తెలుగులో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న అక్కినేని నాగార్జున,( Akkineni Nagarjuna ) అఖిల్ తో( Akhil ) ఒక భారీ మల్టి స్టారర్ సినిమాను కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే బాలయ్య కొడుకు అయిన మోక్షజ్ఞ( Mokshagna ) కూడా ప్రశాంత్ వర్మ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు.మరి వీరిలో ఈయన ఈ ప్రాజెక్టుని పట్టాల మీదకి ఎక్కిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక రీసెంట్ గా ఆయన బాలీవుడ్ ఇండస్ట్రీలో రన్వీర్ సింగ్ తో ఒక భారీ ప్రాజెక్టు చేయాలని అనుకున్నాడు.అయినప్పటికీ అది వర్కౌట్ అవ్వలేదు దాంతో ఆ సినిమాని క్యాన్సిల్ చేశాడు.
ఇక ఇప్పటికే బాలయ్య బాబు కొడుకును ఇంట్రడ్యూస్ చేసే పనిని బాలయ్య ప్రశాంత్ వర్మకి అప్పజెప్పాడనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇక మొత్తానికైతే హనుమాన్ సినిమా ద్వారానే ఒక్కసారిగా పాన్ ఇండియాలో భారీ గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ ఫ్యూచర్ లొ మరిన్ని సూపర్ మాన్ ప్రాజెక్టులను చేయబోతున్నట్టుగా కూడా తెలియజేశాడు.మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇక మీదట కూడా ఆయన తెలుగు హీరోలతోనే సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ఎవరితో సినిమాలు చేస్తాడు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…
.