స్కిన్ బ్లీచింగ్.దీని గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.
చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చుకోవడం కోసం, పిగ్నెంటేషన్ సమస్యను నివారించుకోవడం కోసం, ట్యాన్ ను వదిలించుకోవడం కోసం చాలా మంది బ్లీచింగ్ పద్ధతిని ఫాలో అవుతుంటారు.ఇందులో భాగంగా కమర్షియల్ బ్లీచింగ్ ప్రొడక్ట్స్ ను వాడుతున్నారు.
అయితే వాటి వల్ల ప్రయోజనాలు కంటే చర్మానికి నష్టాలే ఎక్కువగా ఉంటాయి.ఎందుకంటే, బయట మార్కెట్స్‌లో దొరికే బ్లీచింగ్ ఉత్పత్తుల్లో కెమికల్స్ అధికంగా నిండి ఉంటాయి.
వాటిని యూస్ చేసే బదులు ఇంట్లోనే సహజంగా చర్మాన్ని బ్లీచ్ చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక ఆరెంజ్ ఫ్రూట్‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి తొక్కతో పాటుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న ఆరెంజ్ పేస్ట్ నుండి స్ట్రైనర్ సాయంతో క్రీమీ స్ట్రక్చర్‌లో ఉండే మిశ్రమాన్ని వేరు చేయాలి.
ఇప్పుడీ ఆరెంజ్ క్రీమ్‌లో రెండు టేబుల్ స్పూన్ల టమాటో జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఏదైనా బ్రష్‌తో ముఖానికి పట్టించాలి.

ఇరవై నిమిషాల అనంతరం పచ్చి పాలతో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఆపై వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా బ్లీచ్ చేస్తే చర్మం వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.ముఖంపై ఎలాంటి మచ్చలు ఉన్న క్రమంగా తగ్గు ముఖం పడతాయి.ట్యాన్ సమస్య నుండి విముక్తి లభిస్తుంది.మరియు స్కిన్ మృదువుగా కూడా మారుతుంది.