విలేఖరులం అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు - ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట్ మండలంలో మ్యాకాల సిద్దయ్య అనే వ్యక్తిని భూ విషయంలో మేము విలేకరులం అంటూ బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన మ్యాకల సిద్దయ్య s/o లింగయ్య అనే వ్యక్తి నిమ్మపల్లి గ్రామ రెవెన్యూ శివారులో వివిధ సర్వే నంబరులలో 5 ఎకరాల భూమి కలదు, గత 50 సంవత్సరాల నుండి ఇట్టి భూమిలో కాలువ ద్వారా వచ్చే నీటి సరఫరా ఆధారంగా వరి పంట పండిస్తున్నాడు, అట్టి కాలువ వెంట అదే గ్రామానికి చెందిన పలువురు రైతులకు చెందిన వ్యవసాయ భూములు ఉన్నవి, అట్టి కాలువ ప్రక్కనే వారి పొలానికి వెళ్ళడానికి ఒక బండ్లబాట అనాదికాలంగా ఉంది,

 Asp Seshadrini Reddy Will Take Action If They Claim To Be Journalists And Make I-TeluguStop.com

అట్టి బాటను అటు వైపుగా ఉన్న రైతులందరు ఉపయోగించుకుంటారు, గత సంవత్సరం అదే గ్రామానికి చెందిన దర్రా మల్లయ్య అనే వ్యక్తి పొలం ప్రక్కనే గల కాలువను కొంతబాగం గూడిపివేసి, కిందికి ఉన్న పొలాలకు నీరు రాకుండా చేయడంతో, అదే గ్రామానికి చెందిన డప్పుల కరుణాకర్, డప్పుల నరేష్, మల్యాల ప్రసాద్ అను ముగ్గురు వ్యక్తులు తాము పలు పత్రికలలో రిపోర్టర్ లుగా పనిచేస్తున్నామని, తమకు చాలా పలుకుబడి ఉందని, మేము తలుచుకుంటే నిమ్మపల్లి గ్రామంలో ఏమైనా చేయగలమని, మేము ముగ్గురం దర్రా మల్లయ్యకు చెప్పి అట్టి కాలువ సమస్యకు పరిష్కారం చూపిస్తామని, అందుకు గానూ తమకు 50వేల రూపాయలు ఇవ్వాలని బెదిరించి,

అతని నుండి బలవంతంగా 15 వేల రూపాయలు తీసుకున్నారు, తనతో పాటు నిమ్మపల్లి మరియు పరిసర గ్రామాలలోని చాలామంది దగ్గర, సదరు ముగ్గురు వ్యక్తులు ఇదే విదంగా రిపోర్టర్ లము అని చెప్పి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తారని, ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే వారి పనులను చెడగొడతారని, ఎవరైనా ఎదిరిస్తే వారిపై తమ పత్రికలలో అసత్య ప్రచారం చేస్తారని, మరలా కొన్నిరోజుల క్రితం తనను మరికొంత డబ్బు ఇవ్వాలని బెదిరించగా అతను నిరాకరించడంతో, తన పక్క పొలం వ్యక్తి ఐనా దర్రా మల్లయ్యతో చేరి తమ పొలానికి వెళ్ళే దారిని మొత్తం ద్వంసం చేసి, తమ పొలాలకు దారి లేకుండా చేసినారని,

అట్టి దారి విషయమై మాట్లాడితే నే అంతూ చూస్తామని తనను బెదిరించిగా మ్యాకాల సిద్దయ్య కోనరావుపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారించగా సదరు నిందితులపై గల ఆరోపణలు నిజమని, ఫిర్యాది నుండి వారు బలవంతంగా 15,000/- రూపాయలు వసూలు చేసినారని నిర్ధారణ కాగా పై ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఏఎస్పీ తెలిపారు.

పై ముగ్గురు వ్యక్తులు అయిన డప్పుల కరుణాకర్, డప్పుల నరేష్, మల్యాల ప్రసాద్, వివిధ పత్రికలలో రిపోర్టర్ లుగా పనిచేస్తున్నామని చెప్పి ఎవరి దగ్గరైన బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube