రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని రాజాప్రపుల్ల రెడ్డి పంక్షన్ హాల్ లో నిర్వహించిన కళ్యాణలక్ష్మి,షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు హజరయ్యి చెక్కుల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నిరుపేదల ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాది ముబారక్ కొండంత అండగా నిలిచిందని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు, ఏఎంసి ఛైర్మన్ స్వరూప,వైస్ చైర్మన్ నర్సింగం గౌడ్, తహశీల్దార్ జయంత్ ,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్, డైరెక్టర్లు,లబ్ధిదారులు పాల్గొన్నారు.







