ఆటల్లో గెలుపోటములు సహజం, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలి.

గ్రామీణ యువత జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలి ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్.జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రుద్రంగి మండలం మనాల గ్రామంలో వాలిబాల్ టోర్నమెంట్.

 Winning And Losing In Games Is Natural, And Everyone Should Have A Sportsmanship-TeluguStop.com

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్,తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డితో కలసి ప్రారంభించిన విప్.

పోలీస్ శాఖకు యువతకు సత్సంబంధాలు మెరుగుపర్చలనే ఉద్దేశ్యంతో రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలిబాల్ పోటీలలో క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరుస్తూ జిల్లా,జాతీయ స్ధాయిలో రాణించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ….పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతల పరిరక్షణ ఒక్కటే తప్ప ఇతరత్రా సమస్యలు దూరంగా ఉంటుందనే అనే ముద్ర నుండి సామాజిక రుగ్మతలు రూపుమముతూ ఏదైనా సమస్యలు తలెత్తుతే మేము ఉన్నాం అంటూ శాంతి భద్రతలను సమర్ధవంతగా నిర్వహిస్తూనే ప్రజలకు, యువతకు పోలీస్ సేవలు మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో జిల్లాలో విన్నూత కార్యక్రమాలు చేపడుతూ జిల్లా ప్రజలకు భరోసా కల్పిస్తున్న జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలోని జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో డ్రైవింగ్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ లేని లైసెన్స్ లు అందజేయలనే ఉద్దేశ్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా నిర్వహించి గతంలో 100 మంది యువతి యువకులకు లైసెన్స్ అందజేయడం జరిగిందని రెండవ దశలో సుమారు 700 వరకు లైసెన్స్ లు అందిచేలా ప్రణాళిక రూపొందించడం అభినందనియమన్నారు.

యువత సన్మార్గంలో నడిచేందుకు గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి రూపొందించిన ప్రణాళికలను పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చెస్తూ,జిల్లాలో పోలీస్ శాఖ గంజాయిపై ఉక్కుపాదం మోపుతు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వ్యక్తులను సన్మార్గంలో నడిపించడానికి జిల్లా కేంద్రంలో డి ఆడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్య నిపుణులతో కౌన్సెలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

గ్రామీణ ప్రాంతా యువత జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని, ఏఆటలోనైనా గెలుపు,ఓటమి అనేది సహజం కాని చివరి వరకు పోరాడాలి అన్నారు.ప్రతి ఒక్కరిలో టీమ్ స్పిరిట్ ఉండలని అపుడే విజయం మన చెంతకి చేరితుందని అని అన్నారు.

యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా నైపున్యాభివృద్ది చేసుకొని చదువు ,క్రీడలపై దృష్టి సారించాలన్నారు.

ఎస్పీ మాట్లాడుతూ…జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతంలో ఉన్న మానాల గ్రామాన్ని తరచు సందర్శించడం జరుగుతుందని, ఇటీవల కాలంలో మానాల చుట్టూ ప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలకు ఉచిత వైద్యా శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని,అంతే కాక యువతకు పోలీస్ సేవలు చేరువ చేయాలని, యువత చెడు వ్యాసనాల వైపు దారి మల్లకుండా యువతకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ, స్పోర్ట్స్ మీట్ వంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు.

యువత గంజాయి వంటి మాధకద్రవ్యాల దూరంగా ఉండాలన్నారు.

మానాల గ్రామంలో ఏర్పటు చేసిన మండల స్థాయి వాలిబాల్ పోటీలలో 13 జట్లు పాల్గొననున్నాయి అని వీరికి పోటీల అనంతరం గెలుపొందిన జట్లకు బహమతులు అందజేయాడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ .చందుర్తి సి.ఐ వెంకటేశ్వర్లు, ఎస్.ఐ లు అశోక్,అంజయ్య,క్రీడాకారులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

విన్నర్స్.1.రుద్రంగి స్పోర్ట్స్ క్లబ్

రన్నర్స్.1.బడి తండా.

విన్నర్స్, రన్నర్స్ కి బహమతులు, విన్నర్స్ కి 4000 రూపాయలు, రన్నర్స్ కి 2000 రూపాయలు అందించిన వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube