నాబార్డు ద్వారా రైతులకు ప్రత్యేక రుణ సదుపాయం

Special Loan Facility To Farmers Through NABARD Details, Special Loan Facility ,farmers ,NABARD, Jangiti Sathayya, Farmers Loans, Sarvaipalle ,

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సింగిల్ విండో పాలక వర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.నాబార్డు ద్వారా రైతులకు బంగారు,వాహనాల పై ప్రత్యేకంగా రెండు కోట్ల రూపాయలను ఋణము గా అందజేయాలని సింగిల్ విండో పాలక వర్గం తీర్మానించినట్లు సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణా రెడ్డి అన్నారు.

 Special Loan Facility To Farmers Through Nabard Details, Special Loan Facility ,-TeluguStop.com

చైర్మన్ అద్యక్షతన మహాజన సభ సోమవారం నిర్వహించారు.మహాజన సభలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం లో గల శ్రీ లక్ష్మి కేశవ పెరమాండ్ల గుట్ట వద్ద ప్రతి ఏటా రైతులు పండించిన పంటలు అమ్ముకోవడం కోసం ధాన్యం తీసుకువస్తే వర్షాలు కొడితే ధాన్యపు రాశులు వర్షానికి నానుతున్నయని అక్కడ సిమెంట్ తో కల్లాలను ఏర్పాటు చేయాలని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ మహాజన సభ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అక్కడ కల్లాల ఏర్పాటు నిర్మాణం కోసం మహజనసభ తీర్మానం చేశారు.

సర్వాయి పల్లె వద్ద ఏర్పాటు చేసిన డీజిల్ బంక్ నిర్మాణం కోసం లక్షల నిధులు వెచ్చించి నిరుపయోగంగా ఎందుకు వదిలేశారని దీంతో ప్రజాధనం వృధాగా పోతుందని దీనిని వినియోగంలోకి తీసుకురావాలని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ మహాజన సభ దృష్టికి తీసుకెళ్లగా దీనిపై చైర్మన్ కృష్ణా రెడ్డి వివరణ ఇస్తు కేంద్ర్రభుత్వము నుండి 12శాతం సబ్సిడీ రావాలని రాకపోవడం తో డీజిల్ బంక్ వినియోగం నిలిపివేశామని ఇట్టి విషయం తెలంగాణ రాష్ట్రం లోని సహకార బ్యాంక్ ల సమావేశం ఢిల్లీలో జరిగినప్పుడు అమిత్ షా దృష్టికి తీసుకెల్లామని చైర్మన్ అన్నారు.సింగిల్ విండో సెంటర్ లలో పనిచేసే వారు 30 రోజుల పాటు పనిచేస్తే ఉపాధి హామీ పథకం పనికి వెళ్ళే వారికి పడిన కూలీ డబ్బులు కంటే తక్కువ వస్తున్నాయని వారికి జీతాలు పెంచాలని మహజనసభ తీర్మానించింది.

Telugu Latest, Rajannasircilla, Sudheer, Telugudistricts-Rajanna Sircilla

43 కిలోలు లేదా 42 కిలోలు ధాన్యం తూకం గతంలో వేయడం వల్ల రైతులం ఇబ్బందులు పడ్డామని ఈ సారి ధాన్యం తూకం వేసే సమయంలో 40 కిలోలు ధాన్యం తూకం వేయాలని రైతులను ఇబ్బందులు పెట్టకూడదని రైతులు మహాజన సభ దృష్టికి తీసుకెళ్లారు.వడ్ల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు సమయం లో లైటింగ్ తో పాటు అన్ని రకాల వసతులు కల్పించాలని రైతులు మహాజన సభ దృష్టికి తీసుకు వెళ్ళారు.నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు మంత్రి కెటిఆర్ సహకార ముతో సింగిల్ విండో ను అభివృద్ధి చేస్తున్నామని పాలకవర్గం అన్నారు.ఈ సమావేశం లో సింగిల్ విండో వైస్ చైర్మన్ జంగిటి సత్తయ్య, డైరెక్టర్లు నేవూరి వెంకట్ నర్సింహ రెడ్డి, దొమ్మటి నరసయ్య రామచంద్ర రెడ్డి తో పాటు డైరెక్టర్స్ పాల్గొన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube