ఎన్నికల కమిషన్ నిబంధనలు పకడ్బందీగా పాటిస్తూ సకాలంలో నిర్దేశిత పనులు పూర్తి చేయాలి

పొరపాట్లు లేకుండా పకడ్బందీగా ఓటరు జాబితా జూన్ నెలలో ఈవిఎం, వివిప్యాట్ లో ఎఫ్.ఎల్.

 The Regulations Of The Election Commission Should Be Strictly Followed And The P-TeluguStop.com

సి పూర్తి చేయాలి ప్రతి శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహణ పట్టణ ప్రాంతాల్లో స్వీప్ కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ ప్రతి జిల్లా ఎన్నికల కార్యాలయంలో సోషల్ మీడియా బృందాల నియామకం రాష్ట్ర  ఎన్నికల ప్రధాన అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్రాజన్న సిరిసిల్ల జిల్లా:ఎన్నికల కమిషన్ నిబంధనలు పకడ్బందీగా పాటిస్తూ సకాలంలో నిర్దేశిత ఎన్నికల పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అధికారులకు సూచించారు .బుధవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి.రవికిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్ లు, అదనపు కలెక్టర్ లతో ఓటర్ జాబితాలో  ఎఫ్.ఎల్.సి, పి.ఈ.టీ తోలగింపు, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ తదితర అంశాలపై నిర్వహించారు.ఈ  వీడియో కాన్ఫరెన్స్ కు  జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ లు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించేందుకు ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం, నిర్దేశించిన నమూనా లో మూడు రోజులలో పంపాలని ఆయన తెలిపారు.  జూన్ మాసంలో ఈవిఎం, వివిప్యాట్ల ఎఫ్.ఎల్.సి నిర్వహించాలని,  రాజకీయ పార్టీలకు ముందస్తు సమాచారం అందించి వీడియో రికార్డింగ్ నిర్వహిస్తూ ఎఫ్.ఎల్.సి పూర్తి చేయాలని అన్నారు.ఎఫ్.ఎల్.సి నిర్వహణ అవసరమైన సామాగ్రిని తీసుకునేందుకు ప్రతి జిల్లా నుంచి నోడల్ అధికారి నియమించాలని తెలిపారు.ఎన్నికల నిర్వహణ కోసం ఉద్యోగులకు, సిబ్బంది శిక్షణ అందించేందుకు  రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి మాస్టర్ ట్రయినర్ల నియామక ప్రతిపాదనలు ఏప్రిల్ నెలాఖరు వరకు అందించాలని అన్నారు.

ఫోటో సిమిలర్ ఎంట్రీ కింద తొలగించిన ఓట్ల వివరాలు,  ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓట్ల వివరాలు మరోసారి పరిశీలన పురోగతిపై జిల్లాల వారీగా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.  జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రతి వారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించి, మినెట్స్ ను ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఆయన సూచించారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ ఒకటి నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తూ సప్లిమెంటరీ ఓటరు జాబితా విడుదల చేయాలని, జిల్లాలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి ఓటరుగా నమోదు చేయాలని ఆయన తెలిపారు.జిల్లాలో గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని ఓటింగ్ తక్కువ నమోదయిన ప్రాంతాల్లో ఓటరు ప్రాముఖ్యత కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేసుకోవాలని, జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో స్వీప్ యాక్టివిటిస్ కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు.

స్వీప్ యాక్టివిటిస్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారి నియామకం చేయాలని ఆయన తెలిపారు.ఎన్నికల సమయంలో ఎన్నికల వ్యవస్థ పై అనుమానాలు సృష్టించే విధంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాలు సకాలంలో తిప్పికోట్టె విధంగా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో సోషల్ మీడియా బృందాలను నియమించాలని అన్నారు.

గరుడ యాప్ లో ప్రతి బూత్ స్థాయి అధికారి తప్పనిసరిగా  లాగిన్ అయ్యేలా  ఈ.ఆర్.ఓ లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా 7.6 లక్షల ఇండ్లలో 6 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారని, బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మరో సారి తనిఖీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు .వీడియో సమావేశం అనంతరం అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ ఓటర్ల జాబితా పై ఆర్డీఓ లు , సిరిసిల్ల , వేములవాడ తహశీల్దార్ లు విజయ్ కుమార్, రాజు , ఎన్నికలు ఉప తహశీల్దార్ రెహమాన్ లకు పలు సూచనలు చేశారు.ప్రతి శనివారం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించి ఓటరు జాబితాలో వచ్చే మార్పులు, ఎన్నికల కమిషన్ సూచనలు వివరించాలని కలెక్టర్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube