అనంతపురం జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి( YS Jaganmohan Reddy ) రైతుల నుండి నిరసన సెగ తగిలింది.ముఖ్యమంత్రి ప్రయాణించాల్సిన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో జగన్ రోడ్డు మార్గంలో పుట్టపర్తి చేరుకున్నారు.
ఈ సమయంలో ధర్మవరం మండలం పోతుల నాగేపల్లి వద్ద జగన్ కాన్వాయ్ ని రైతుల అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది.ఈ క్రమంలో భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి… రైతులను తప్పించి జగన్ కాన్వాయ్ ముందుకు సాగేలా చేశారు.
స్థలాల కోసం అంటూ తూంపర్తి, మొట్టుమర్రు ప్రాంతంలో 210 ఎకరాలు సేకరించిన అధికారులు ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది.పరిహారం ఇప్పించడంలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి( MLA Kethi Reddy Venkatrami Reddy ) సరిగ్గా స్పందించలేదని విఫలమయ్యారని మండిపడ్డారు.
దీంతో తాము ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వడానికి వస్తే పోలీసులు తమని తోసేసారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే సీఎం జగన్ పర్యటనల సమయంలో వరుస పెట్టి హెలికాప్టర్ లలో సాంకేతిక లోపాలు రావడం పట్ల వైసిపి పార్టీలో అంతర్గతంగా ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఏదైనా కుట్ర జరుగుతుందా అనే చర్చ జరుగుతోంది.







