1.ఆటా (ATA ) ఆధ్వర్యంలో మెగా తెలుగు కాన్ఫరెన్స్
అమెరికా తెలుగు సంఘం (ATA ) ఆధ్వర్యంలో జూలై 17 న కాన్ఫరెన్స్ అండ్ యూత్ కన్వెన్షన్ సెంటర్ వేదిక గా ఈ కార్యక్రమం జరగనుంది.
2.తొమ్మిది దేశాల విషయంలో హాంకాంగ్ కీలక నిర్ణయం
కోవిడ్ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో హాంకాంగ్ కీలక నిర్ణయం తీసుకుంది.యూఎస్, బ్రిటన్ సహా తొమ్మిది దేశాల అంతర్జాతీయ విమాన సర్వీసుల పై నిషేధం ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది.
3.చైనా లో కూలిన విమానం
చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది.133 మందితో వెళ్తున్న బోయింగ్ 737 విమానం కుప్పకూలింది.ఈ ఘటనలో పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకున్నట్టు సమాచారం.
4.బ్రిటన్ లో భారత సంతతి విద్యార్థి హత్య
భారత సంతతికి చెందిన విద్యార్థిని తన్వానీ బ్రిటన్ లో హత్యకు గురయ్యారు.ఈ హత్య కు పాల్పడిన ట్యునీషియా జాతీయుడి ని పోలీసులు అరెస్ట్ చేశారు.
5.ఉక్రెయిన్ కు చైనా ఆర్థిక సాయం
ఉక్రెయిన్ కు మానవతా దృక్పథంతో 10 మిలియన్ యువాన్ లు ఇవ్వనున్నట్టు చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
6.భారత్ కు అరుదైన కళాఖండాలను అప్పగించిన ఆస్ట్రేలియా
భారత్ ఆస్ట్రేలియా మధ్య వర్చువల్ శిఖరాగ్ర సమావేశం సోమవారం జరిగింది.ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మెరిసన్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ‘ నమస్కార్ ‘ తో అభినందించారు.ఈ సందర్భంగా భారత్ నుంచి ఆస్ట్రేలియాకు అక్రమంగా తరలించిన 29 భారత కళాఖండాలను ఆస్ట్రేలియా అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నందుకు భారత ప్రధాన కృతజ్ఞతలు తెలిపారు.వీటిని భారత్ కు అప్పగించేందుకు ఆస్ట్రేలియా ఏర్పాటు చేసింది.
7.ఖతర్ ఎయిర్ వేస్ విమానం అత్యవసర లాండింగ్
భారత్ నుంచి దోహా కు బయలుదేరిన ఖతర్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం అత్యవసరంగా పాకిస్తాన్ లోని కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.
8.రష్యా బలగాలను అడ్డుకుంటున్న ఉక్రెయిన్ వాసులు
ఉక్రెయిన్ లో రష్యా బలగాలు మారణహోమం విస్తరిస్తుండటంతో రష్యా బలగాలను సామాన్య జనం సైతం అడ్డుకుంటూ తమ నిరసన ను వ్యక్తం చేస్తున్నారు.
9.అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతికి వ్యక్తి
2024 ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకపోతే రో ఖన్నా అనే భారత సంతతికి చెందిన రో ఖన్నా ను అమెరికా అధ్యక్ష పదవి రేసులో కి దింపాలని జెర్ని స్టాండర్స్ వర్గం అనుకుంటోంది.