ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా వైద్యాధికారి

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ ప్రభుత్వo మహిళల ఆరోగ్యం గురించి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ఇల్లంతకుంట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం రోజున జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, డిప్యూటీ డి ఎం ఎచ్ ఒ డాక్టర్ శ్రీరాములు , స్థానిక ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య యాదవ్ , సర్పంచ్ కునబోయిన భాగ్యలక్ష్మి- బాలరాజు ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం 18 సం నుంచి ఆపై ఏ వయసులో ఉన్న మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు ముఖ్యంగా గొంతు, రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు నిర్వహించబడును అని అన్నారు.

 District Medical Officer Launched Arogya Mahila Program Rajanna Sircilla, Distr-TeluguStop.com

ప్రతి మంగళవారం రోజున నిర్వహించబడును అన్నారు ఇట్టి కార్యక్రమంలో 8 రకాల సేవలు ఉంటాయి అన్నారు.డయాగ్నో స్టిక్స్( రక్త, మూత్ర పరీక్షలు), క్యాన్సర్ స్క్రీనింగ్, సూక్ష్మ పోషక లోపాలు, మూత్ర నాళ ఇన్ఫెకషన్లు,పిఐడి, పిసిఓఎస్, కుటుంబ నియంత్రణ, ఋతు స్రావ సమస్యల నిర్వహణ, మెనోపాజ్ నిర్వహణ, లైంగిక వ్యాధుల నిర్వహణ, శరీర బరువు నిర్వహణ వీటితో పాటు మందుల పంపిణీ, ఫాలో అప్ సేవలు అందించబడతాయనీ అన్నారు.

ఇట్టి కార్యక్రమాన్ని మండలంలో ఉన్న 18 సం నిండిన ప్రతి ఒక్క మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం స్థానిక సర్పంచ్, ఎంపిటిసిలు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు ను, డిప్యూటీ డిఎమ్ఏచ్ఒ డాక్టర్ శ్రీరాములును గణంగా సన్మానించారు.

ఇట్టి కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ శరణ్య, డాక్టర్ కట్ట రమేశ్, అనంతారం, ఎంపిటిసి పుష్పలత, తాళ్ళ పల్లి సర్పంచ్ పద్మ, ఎచ్ఈఒ లింగం, సూపర్వైజర్స్, ఏఎన్ఎంలు, ఆశాలు, ప్రజలు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube