ఎండాకాలంలో శరీరంలోని నిస్సత్తువ.. దూరం చేసుకోవడానికి ఇలా చేయండి..

ఈ మధ్యకాలంలో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.వాతావరణంలో తేమ తగ్గిపోతుంది.

 Home Remedies For Summer Fatigue,summer Season,health Tips,telugu Health,body We-TeluguStop.com

దాంతో మన శరీరంలో కనిపించే మొదటి ఇబ్బంది డిహైడ్రేషన్.చూడడానికి చిన్న విషయం లా కనిపించిన శరీరంలో మెరుపు తగ్గడం నుంచి నిస్సత్తువ వరకు ఎన్నో సమస్యలు కనిపిస్తాయి.ఒక్కోసారి ఒళ్లంతా నొప్పులు, కండరాలు పట్టేసినట్లు ఉంటాయి.ఈ సూచనలు ఏవి పెద్దపెద్ద ఆరోగ్య సమస్యలకు కారణం కాకపోవచ్చు.శరీరంలో తగినన్ని నీటి విలువలు లేకపోవడం వల్ల కూడా ఇలా జరగవచ్చు.


మీరు తరచూ ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తగినన్ని నీళ్లు తాగడం మంచిది.డిహైడ్రేషన్ సమస్యను గుర్తించడానికి తలనొప్పి కూడా ఒక ముఖ్య సూచన.ఈ సారి భరించలేనంత తలనొప్పి వచ్చినప్పుడు ఒక రెండు గ్లాసుల నీరు త్రాగడం ఎంతో మంచిది.

అందులోకి ఇక మూత్రం రంగు మారితే వెంటనే రెండు గంటలకు ఒకసారి నాలుగైదు సార్లు బార్లీ నీళ్లు తాగడం మంచిది.


అలా చేయడం వల్ల సమస్య వెంటనే దూరం అయిపోతుంది.అలసట, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే ఒక కొబ్బరి బొండం తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఎలక్ట్రోలైట్స్ మీ నిస్సత్తువను తగ్గిస్తాయి.

ఈ నీళ్లు శరీరంలో డిహైడ్రేషన్ సమస్యల్ని అదుపులో ఉంచుతాయి.చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.

ఒంట్లో నీటి శాతం తగ్గితే భావోద్వేగాల్లోనూ హెచ్చుతగ్గులు వస్తాయని ఒక అధ్యయనంలో తెలిసింది.మానసిక అలసట, చికాకు ఇబ్బంది పెడుతుంటాయి.

అంతేకాకుండా రోజు మీకు హాయిగా గడిచిపోవాలంటే కూడా ఉదయం లేచిన వెంటనే తగినన్ని నీళ్లు తాగడం మంచిది.మీ శరీర జీవ క్రియలు అన్ని సక్రమంగా పనిచేస్తాయి.

ఉల్లిపాయతో మరో రకమైన ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే నోటి దుర్వాసన వస్తుంది అనుకుంటే పొరపాటే.ఇది కూడా మీ శరీరంలో నీటి శాతం తగ్గడానికి ఒక ముఖ్య కారణం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube