"రక్ష బంధన్" సందర్భంగా జిల్లా ఎస్పీ కి, పోలీస్ అధికారులకు రాఖీలు కట్టిన విద్యార్థినులు

ఎల్లప్పుడూ మహిళలకు అండగా ఉంటూ మీ రక్షణయే పోలీస్ ప్రథమ బాధ్యత అని,సెల్ఫ్ డిఫెన్స్ టెక్నీక్స్ నేర్చుకొని పురుషుల నుండి రక్షణ తీసుకునే స్థాయి నుండి పురుషులను రక్షించే స్థాయి మహిళలకు ఎదగాలని ఎస్పీ ఆకాక్షించారు.“రక్ష బంధన్” సందర్భంగా విద్యార్థినిలతో ఈ రోజు తంగలపల్లి మండలం తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ & డిగ్రీ కళాశాలను సందర్శించి రాఖీ పండుగ సందర్భంగా ఇంటికి పోలేదని బాధపడవద్దని, నేను పోలీస్ అధికారి స్థాయిలో రాలేదని మీ అందరికి ఒక అన్నగా మీ దగ్గరకు వచ్చన్నని అక్కచెల్లెళ్ల స్థానంలో మీరు అందరూ నాకు రాఖీ కట్టాలని నేను మీకు రక్షగా ఉంటానని అన్నారు.

 Students Tied Rakhis To Sp Akhil Mahajan On The Occasion Of Raksha Bandhan, Stud-TeluguStop.com

అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…మాది ఉమ్మడి కుటుంబం అని నాకు తొమ్మిది మంది అక్కచెల్లెళ్లు రాఖీ పండుగ సందర్భంగా నాకు రాఖీ కట్టడానికి ఈ రోజు నా దగ్గర ఎవరు లేరు నా అక్కచెల్లెళ్ల స్థానంలో మీరు అందరూ నాకు రాఖీ కట్టాలని నేను మీకు రక్షగా ఉంటానని అన్నారు.జిల్లాలో మహిళల రక్షణకు అనేక కార్యక్రమాలు నిరహిస్తున్నాం అని అందులో భాగంగా ఆపరేషన్ జ్వాలా కార్యక్రమంతో విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ,విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నీక్స్ నేర్చుకొని పురుషుల నుండి రక్షణ తీసుకునే స్థాయి నుండి పురుషులను రక్షించే స్థాయి మహిళలకు ఎదగాలన్నారు.

విద్యార్థినిలకు,పాఠశాల ,కళాశాల విద్య చాలా ముఖ్యమైనదని ఎవరు కూడా మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా మంచిగా చదువుకోవాలని ప్రతి ఒక్క ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని ఉన్నత స్థానాల్లో స్థిరపడి అమ్మానాన్నలకు, మనకు చదువు నేర్పిన ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకరవలన్నారు.

విద్యార్థినిలు మహిళలు మౌనం విడి ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని,నిర్భయంగా ముందుకు వచ్చి మీ సమస్యలను చెప్పుకున్నాప్పుడే మరింత భద్రత కల్పించగలువుతామని, మహిళలు,విద్యార్థినిలు,వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425కు పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.

పిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అన్నారు.ఎస్పీ వెంట సి.ఐ మొగిలి,ఎస్.ఐ సుధాకర్, కళాశాల ప్రిన్సిపాల్,సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube