చాలా మంది ముఖానికి తీసుకున్న శ్రద్ద పాదాలకు తీసుకోరు.అలాగే చేతులకు కూడా శ్రద్ద బాగానే పెడతారు.
పాదాల దగ్గరకు వచ్చేసరికి సరైన శ్రద్ద పెట్టరు.రోజువారీ పనులతో బిజీగా ఉండుట వలన పాదాలపై పెద్దగా శ్రద్ద పెట్టరు.
పాదాలపై శ్రద్ద పెట్టకపోతే తేమ తగ్గిపోయి రఫ్ గా కన్పిస్తాయి.అందువల్ల పాదాలపై కొంత శ్రద్ద పెడితే మంచిది.
ఇప్పుడు పాదాలు అందంగా,ఆకర్షణీయంగా కనపడటానికి ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం.
మజ్జిగలో కొంచెం పసుపు రాసి రెండు పాదాలకు రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.
అయితే ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉండాలి.
ఒక స్పూన్ శనగపిండిలో అరస్పూన్ తేనే,అరస్పూన్ నిమ్మరసం,చిటికెడు పసుపు వేసి పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని పాదాలకు రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారంలో మూడు సార్లు చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.
రెండు స్పూన్ల ఫైనాపిల్ జ్యుస్ లో అరస్పూన్ తేనే కలిపి పాదాలకు రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేస్తే పాదాలకు బాగా రక్తప్రసరణ జరిగి పాదాలు ఆరోగ్యంగా అందంగా కనపడతాయి.
బేకింగ్ సోడా పాదాల మురికిని వదిలించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
బేకింగ్ సోడాలో నీటిని పోసి పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని పాదాలకు రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.