పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా బిగ్ బాస్ విన్నర్ కౌశల్

బిగ్ బాస్’ సీజన్ 2 రియాలిటీ షో ద్వారా ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలలో స్టార్ హీరో రేంజ్ లో గుర్తింపు సొంతం చేసుకున్న అన్తుడు కౌశల్.బిగ్ బాస్ షోలో తన వ్యక్తిత్వంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న కౌశల్ ఈ షో ద్వారా మంచి మైలేజ్ సొంతం చేసుకొని కౌశల్ కి మంచి గుర్తింపు వచ్చింది.

 Big Boss 2 Winner Kaushal Got Movie Offer, Tollywood, Telugu Cinema, South Cinem-TeluguStop.com

ఆ పాపులారిటీతో తెలుగులో బిజీ స్టార్ గా మారిపోతాడని, హీరోగా అవకాశాలు వస్తాయని చాలా మంది భావించారు.అయితే కౌశల్ కి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.

కొన్ని ప్రాజెక్టులు ప్రారంభ దశలోనే ఏవో కారణాల వలన ఆగిపోయాయి.

కౌశల్ కారణంగానే ఆ సినిమాలు ఆగిపోయాయని టాక్ వినిపించింది.

కథలు వేలుపెట్టి ఇష్టానుసారంగా మార్చమని చెప్పడంతో వచ్చిన అవకాశాలు కూడా దూరం అయ్యాయని చర్చ నడిచింది.తాజాగా కౌశల్ కి ఒక అవకాశం లభించినట్టు తెలుస్తోంది.

ఆది సాయికుమార్ కథానాయకుడిగా ఒక సినిమా రూపొందనుంది.లాక్ డౌన్ తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం కౌశల్ ను తీసుకున్నారని సమాచారం.ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకొస్తుందనీ, తన కెరియర్ కి మరింత హెల్ప్ అవుతుందని కౌశల్ భావిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube