వావ్: 13 నిమిషాల్లో ల్యాప్‌టాప్ డెలివరీ చేసిన ఫ్లిప్‌కార్ట్..?

ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేయడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది.కావలసిన వస్తువులు కొన్న కొద్ది నిమిషాల్లోనే ఇంటికి డెలివరీ చేసే ఫాస్ట్ సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

 Wow Flipkart Delivered The Laptop In 13 Minutes, Flipkart Minutes, Laptop, Fast-TeluguStop.com

బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో లాంటి కంపెనీలు ఇలాంటి సర్వీసులు ఇస్తున్నాయి.ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్( Flipkart ) కూడా ఇలాంటి సేవను ప్రారంభించింది.

దీని పేరు ఫ్లిప్‌కార్ట్ మినిట్స్.రీసెంట్‌గా బెంగళూరులో ఒకాయన స్టార్‌బక్స్‌లో కూర్చుని ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ ద్వారా ఒక ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.

అంతే, కేవలం 13 నిమిషాల్లో ఆ ల్యాప్‌టాప్ అతనికి చేరింది!సన్నీ గుప్తా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో దీనికి సంబంధించి ఒక పోస్ట్ షేర్ చేశాడు.ఆయన ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఒక ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.

అంతే, కేవలం 13 నిమిషాల్లో ఆ ల్యాప్‌టాప్ ఆయన చేతికి అందింది అని చెప్పాడు.ఆర్డర్ చేసిన వెంటనే ట్రాకింగ్ పేజీలో చూస్తే, ల్యాప్‌టాప్ 12 నిమిషాల్లో వస్తుందని చూపించింది.

కానీ అంతకన్నా త్వరగానే ల్యాప్‌టాప్ వచ్చేసింది.సన్నీ గుప్తా ఆ సమయంలో స్టార్‌బక్స్ కెఫేలో( Starbucks Cafe ) కూర్చుని ఉన్నాడు.

ఆయన ఆర్డర్ చేసిన కేవలం 3 నిమిషాల్లో డెలివరీ బాయ్ అక్కడికి వచ్చాడు.ఆయన ఫోన్‌కు వచ్చిన ఒక OTP నిర్ధారించుకుని ల్యాప్‌టాప్ ఇచ్చాడు.

అంతేకాదు, సన్నీ గుప్తా ఆ OTP నిర్ధారించుకునే ముందే ల్యాప్‌టాప్ ప్యాకెట్ తెరవడం మొదలుపెట్టాడు అని ఆయన తన పోస్ట్‌లో చెప్పాడు.

సన్నీ గుప్తా తన పోస్ట్‌లో ‘నేను ఫ్లిప్‌కార్ట్ ద్వారా ల్యాప్‌టాప్ ఆర్డర్ చేసి, పేమెంట్ చేసిన తర్వాత కేవలం 13 నిమిషాల్లో స్టార్‌బక్స్‌లో నా చేతికి అందింది.’ అని చెప్పాడు.ఆ ల్యాప్‌టాప్ పని చేస్తున్న వీడియో కూడా పోస్ట్ చేశాడు.

సన్నీ కొన్న ల్యాప్‌టాప్ ఏసర్ ప్రిడేటర్ ( Laptop Acer Predator )అనే మోడల్.ఈ మోడల్ ఆన్‌లైన్‌లో రూ.95,000 నుంచి రూ.2,50,000 వరకు ధర ఉంటుంది.ఈ బెంగళూరు యూజర్ పోస్ట్ చాలా మంది చూశారు.దానికి 9 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.కామెంట్స్ సెక్షన్‌లో చాలా రకాల రియాక్షన్లు వచ్చాయి.ఉదాహరణకి, ఒక వ్యక్తి ఫ్లిప్‌కార్ట్ ఇంత త్వరగా డెలివరీ చేస్తుందని నమ్మలేదని అన్నాడు.

మరో వ్యక్తి, ఇంత త్వరగా వచ్చిన వస్తువు డిఫెక్టివ్ అయితే ఏం చేస్తావు అని ప్రశ్నించాడు.అయితే దానికి వారంటీ ఉంటుంది కదా ఆ ఫెసిలిటీ వాడుకుంటాను అని సన్నీ గుప్తా రిప్లై ఇచ్చాడు.

ఇది ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్‌లోనే( developed countries ) సాధ్యమవుతుంది అనుకున్నాం కానీ ఫ్లిప్‌కార్ట్ ఇండియాలో దీన్ని సుసాధ్యం చేసి చూపించింది అని మరికొందరు అన్నారు.కేవలం ఏడు నిమిషాల్లో ల్యాప్‌టాప్ డెలివరీ అయింది అంటే స్టోర్ దగ్గరలోనే ఉండి ఉంటుంది, డైరెక్ట్‌గా స్టోర్‌కి వెళ్లి కొనుక్కోవచ్చు కదా అని మరికొంతమంది అన్నారు.ఫ్లిప్‌కార్ట్ హై-వాల్యూ ప్రొడక్ట్స్ 10% డిస్కౌంట్‌తో అందిస్తూ మిగతా వాటికంటే ఒక మెట్టు పైనే నిలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube