నవ ధాన్యాల్లో ఉలవలు ఒకటి.ఈ ఉలవలతో ఎన్నో రకాల వంటలు చేస్తుంటారు.
ముఖ్యంగా ఉలవలతో తయారు చేసే ఉలవ చారును చాలా మంది ఇష్టపడుతుంటారు.ఇక ఉలవలు మంచి రుచి కలిగి ఉండటమే కాదు.
పాస్ఫరస్, ఐరన్, కాల్షియం, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు కూడా నిండి ఉంటాయి.అందుకే ఉలవలు తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్‌ను పొందొచ్చని నిపుణులు చెబుతారు.
అయితే ఉలవలు ఆరోగ్యానికే కాదు.చర్మానికి కూడా అద్భుతంగా సమాయపడతాయి.
ముఖ్యంగా క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్‌ను అందించడంలో ఉలవలు గ్రేట్‌గా ఉపయోగపడతాయి.మరి చర్మానికి ఉలవలను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఉలవలను మెత్తగా పిండి చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఉలవ పిండిలో కొద్దిగా పాలు వేసి మిక్స్ చేసి.ముఖానికి అప్లై చేసుకోవాలి.పది నిమిషాల అనంతరం చల్లటి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తూ ఉంటే.మొటిమలు పోయి చర్మం స్మూత్‌గా మారుతుంది.
అలాగే ఉలవ పిండిలో చిటికెడు పసుపు మరియు పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసి.
ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రంగా ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఇలా మూడు రోజులకు ఒక సారి చేస్తే.మృతకణాలు, మురికి పోయి.
చర్మం గ్లోయింగ్‌గా మారుతుంది.
ఇక ఉలవ పిండిలో కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పది లేదా ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
ఆ తర్వాత కూల్ వాటర్‌తో శుభ్రంగా ముఖాన్ని వాష్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల ముడతలు, మచ్చలు పోయి స్కిన్ క్లియర్ అండ్ గ్లోయింగ్‌గా మారుతుంది.