కులవృత్తులకు చేయూత - 42 మంది లబ్ధిదారులకు బీసీ బందు అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా: కులవృత్తులకు బీసీ బందు చేయూత లాంటిదని లబ్ధిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పిల్లి రేణుక అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన బీసీ బందులో భాగంగా రెండో విడతగా 42 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష విలువైన చెక్కులను ఎంపీపీ పిల్లి రేణుక, జెడ్ పి టి సి లక్ష్మణ్ రావు లతో కలిసి అందజేశారు.

 Handout To Caste Workers 42 Beneficiaries Will Receive Bc Bandhu-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులవృత్తులు చేసుకునేవారు పెట్టుబడి సహాయంతో ఆర్థికంగా బలపడాలని లబ్ధిదారులకు సూచించారు.గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ బందును అమలు చేసిందని పేర్కొన్నారు.

రానున్న శాసనసభ ఎన్నికలలో బీ ఆర్ ఎస్ కు ఓటు వేసి గెలిపించి ముఖ్యమంత్రి పట్ల కృతజ్ఞతను చాటుకోవాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube