నేరం చేస్తే శిక్ష తప్పదు,శిక్షల పెంపుతోనే సమాజంలో మార్పు.

గడిచిన సంవత్సర కాలంలో 60 కి పైగా కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి జైలు శిక్షలు.నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పిపి లను అభినందించిన జిల్లా ఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లా :కోర్టు కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా చేయడం, శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.ఈరోజు ఎస్పీ కార్యాలయంలో పీపీలకు వివిధ కేసుల్లో నిధుతులకు శిక్షలు పడే విధంగా కృషి చేసినందుకు అభినందించి ప్రసంశ పత్రాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….

 If You Commit A Crime, You Must Be Punished, Change In The Society Is Only With-TeluguStop.com

న్యాయాధికారులు ,పోలీస్ అధికారులు సమన్వయం పాటిస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు.పోలీస్ అధికారులు నిరంతరం పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలిస్తూ, ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

పోక్సో, హత్య కేసులను ప్రధానమైనవిగా భావించి ముందుకు సాగాలని ప్రతి కేసుల్లో పంచనమ చేసే సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఫోటోలు వివరాలు సమగ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.సాంకేతికత ప్రస్తుత రోజుల్లో కీలకంగా మారిందని అన్ని కేసుల్లో సైంటిఫిక్ ఆధారాలు కచ్చితంగా జమ చేయాలన్నారు.

కోర్టు కేసులకు సంబంధించిన ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదుపడేలా కృషి చేయాలని శిక్షల శాతం పెరిగేలా పనిచేసే అధికారులను సిబ్బందికి రివార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.గడిచిన సంవత్సర కాలంలో 60 కి పైగా కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి జైలు శిక్షలు కోర్ట్ ద్వారా విదించడం జరిగిందని తెలిపారు.

పై కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన పీపీలు, కే .నర్సింగరావు ఎ డి డి ఎల్ పీపీ పిడిజే కోర్టు ,టీ .పవన్ కుమార్, ఎ డి డి ఎల్ పీపీ ఐ,ఎ డి డి ఎల్ వి .లక్ష్మీ ప్రసాద్ ఎ డి డి ఎల్ పీపీ ఎ ఎస్ జె కోర్టు సిరిసిల్ల, సందీప్ ఏపీపీ పిడిఎమ్ సిరిసిల్లా ,వై.సతీష్ ఏపీపీ ఎ డి ఎం కోర్టు సిరిసిల్ల, పి.విక్రాంత్ ఏపీపీ జె ఎఫ్ సి ఎం వేములవాడ ,జి.లక్ష్మణ్ అడిల్ పీపీ ఏఎస్జే కోర్టు వేములవాడ ,పి .శ్రీనివాస్ ఎస్ పి ఎల్ పీపీ , పోక్సో కోర్ట్ సిరిసిల్ల లను అభినందించి ప్రసంశ పత్రాలు అందించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, టౌన్ సి.ఐ ఉపేందర్, కోర్ట్ మానిటరింగ్ ఎస్.ఐ శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్లు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube