మొక్కలు నాటుదాం - పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .చెట్లను పెంచడం ప్రభుత్వ బాధ్యతగా చూడకుండా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చూసినప్పుడే భావితరాలకు మంచి కాలుష్యరాహిత సమాజాన్ని అందిస్తామని, వివిధ ఫ్యాక్టరీల ద్వారా, మనుషుల ద్వారా వెలువడే కార్బన్డయాక్సైడ్ లను చెట్లు పీల్చుకొని ఆక్సిజన్ మనకు అందిస్తాయి క కాబట్టి చెట్లను పెంచడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని,భూ మండలం పై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణ వాయువు అయిన ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయం లో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని ,భూమి మీద పశుపక్షాదుల నివాసం చెట్లే అని, మానవ జీవన విధానంలో చెట్ల పాత్ర ఎంతో ముడిపడి ఉందని ,స్వచ్ఛమైన అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం గురించి మొక్కలు నాటాలని,నాటిన ప్రతి మొక్కను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.

 Let's Plant Trees - Save The Environment , Plant Trees , Environment , Distric-TeluguStop.com

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క వనమహోత్సవం కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ( District SP ) నేతృత్వంలో నిర్వహిస్తూ సమాజానికి కాలుష్య రహిత వాతావరణo అందించడంలో పోలీస్ శాఖ చేస్తున్న కృషిని ఎమ్మెల్యే గారు అభినందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ .చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయడం అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టకపోవడం కారణంగా ఈ రకమేన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అందువల్ల ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని,మొక్కలు మానవ జీవ కోటికి ప్రాణధారము అనీ భూ భాగములో జీవ కోటికి అత్యంత అవసరైమన వాటిలో మొక్కలు ప్రధానమైనవనీ ప్రతి ఒక్కరూ తమ వంతు భాద్యతగా నాటిన మొక్కలను ఖచ్చితంగా రక్షించాలని తెలియజేసారు .

పోలీస్ స్టేషన్ ఆవరణలో 500 రాకల వివిధ పండ్ల మొక్కలతో ఏర్పాటు చేసిన తోటను జిల్లా ఎస్పీ,ఎమ్మెల్యే ప్రారంభించారు.వనమహోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 5000 మొక్కలు నాటడం లక్ష్యంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో హోమ్ గార్డ్ స్థాయి అధికారి నుండి పై స్థాయి అధికారి వరకు ఈ రోజు మొక్కలు నాటడం జరుగుతుదన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ మోగిలి, ఎస్.ఐ శ్రీకాంత్ , పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube