పోడుభూమి లబ్ధిదారుల విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతి పత్రం.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలో గల పోడుభూమి సమస్యను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎనుమల రేవంత్ రెడ్డి ని గుండారం పోడుభూమి లబ్ధిదారులు కలిసి వాళ్ళ బాధను తెలియజేశారు.
గుండారం పోడు భూముల లబ్ధిదారులు మాట్లాడుతూ ఏండ్ల నుండి, తాతల నాటి నుండి దున్నుకున్న భూములను ఫారెస్ట్ అధికారుల గుంజుకోవడం జరిగిందని రేవంత్ రెడ్డికి వివరించారు.ప్రస్తుతం ఆ భూమిలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు వేయడం జరిగిందన్నారు.
ఆ పోడు భూములను తిరిగి ఇస్తే దున్నుకుంటామని లబ్ధిదారులు తెలియజేయడం జరిగింది.
మాకు బతకడానికి జీవనాధారం లేదని పోడు భూములు ఇస్తే సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటామని తెలిపారు.
అంతేకాకుండా పోడుభూమి కమిటీ చైర్మన్ బానోతు రాజునాయక్ భూములు దున్నుకోడానికి ప్రయత్నం చేస్తే మాపై పీడీ యాక్ట్ లాంటి కేసులు పెడతామని బెదిరిస్తున్నారని రేవంత్ రెడ్డి కి తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పోడు భూముల సమస్యపై ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్,సిరిసిల్ల ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి,సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోడు భూముల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.