ఇటీవల కాలంలో చక్కెర వ్యాధి( Diabetes ) తో బాధపడుతున్న వారి సంఖ్య ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.వయసు పైబడిన వారిలోనే కాదు 30 ఏళ్ల వారు కూడా మధుమేహం సమస్యను ఎదుర్కొంటున్నారు.
మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.ఏదేమైనా మీకు చక్కెర వ్యాధి ఉంటే కనుక.
ఇప్పుడు చెప్పబోయే ఆహారాలతో జర జాగ్రత్తగా ఉండండి.ఎందుకంటే ఈ ఆహారాలు చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి.
మధుమేహులకు హాని కలిగిస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం మధుమేహులకు కీడు చేసే ఆ ఆహారాలపై ఓ లుక్కేసేయండి.

ప్రస్తుత రోజుల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్( Breakfast ) చేసుకునే సమయం లేక చాలామంది నాలుగు బ్రెడ్ ముక్కలు తినేసి వెళ్ళిపోతున్నారు.అయితే మధుమేహం రోగులు వైట్ బ్రెడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.వైట్ బ్రెడ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది.అందువల్ల వైట్ బ్రెడ్ ను తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది.వైట్ రైస్, పాస్తా, షుగర్, షుగర్ తో తయారు చేసిన స్వీట్స్ కు కూడా ఇదే వర్తిస్తుంది.కాబట్టి మధుమేహం ఉన్నవారు ఈ ఆహారాలకు దూరంగా ఉంటే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

అలాగే కిస్ మిస్, ఖర్జూరం, ఆప్రికాట్స్ వంటి డ్రై ఫ్రూట్స్( Dry Fruits ) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.కానీ మధుమేహం ఉన్నవారు మాత్రం వీటిని చాలా మితంగా తీసుకోవాలి.ఎందుకంటే ఇవి షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు ఏర్పడేలా చేస్తాయి.బంగాళదుంప చాలా మందికి ఫేవరెట్ వెజిటేబుల్.వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా బంగాళదుంప( Potato ) తినేవారు ఎంతో మంది ఉన్నారు.షుగర్ వ్యాధి ఉన్నవారు మాత్రం బంగాళదుంపను వీలైనంత తక్కువగా తీసుకోవాలి.
బంగాళదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది.

పాలు, పాల ఉత్పత్తుల్లో ఎటువంటి స్వీట్ కంటెంట్ లేకపోయినా కూడా మధుమేహం ఉన్నవారు వాటిని పరిమితంగా తీసుకోవాలి.పాల ఉత్పత్తులు ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేసి చక్కెర స్థాయిలు పెరిగేలా చేస్తుంది.ఇక ఫ్రూట్ జ్యూసులు( Fruit Juices ), సోడాలు, కూల్ డ్రింక్స్, చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ వంటివి కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ తప్పేలా చేస్తాయి.
అందుకే ఆయా ఆహారాలతో జర జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతైనా ఉంది.







