భారీ వర్షాల దృష్ట్యా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని,ప్రజలు పోలీసు వారి సూచనలు సలహాలు పాటిస్తూ సహకరించాలన్నారు.మానేరు( Manair ) పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండలని,వాగులు వంకలు మత్తడి దుంకే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని వాటి వద్దకు వెళ్లావద్దన్నారు.

 In View Of Heavy Rains, Do Not Go Out Unless It Is Urgent: District Sp Akhil Mah-TeluguStop.com

ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులు,కాలువలు,నదులు, రిజర్వాయర్లు,చెరువుల వద్దకు వెళ్ళరాదు.జలాశయాలు, చెరువులు,వాగుల ,ప్రాజెక్టు ల వద్దకు మత్స్యకారులు,ప్రజలు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లకూడదు.

రైతులు( Farmers ) పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి,వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను గాని,వైర్లను గానీ చేతులతో తాకవద్దు.

చెట్ల కింద,పాడైన భవనాలు కింద,శిధిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండరాదు.

విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ ముట్టుకోరాదు.స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్&బి, వైద్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైనా రోడ్ల పై వరద ఉదృతితో రోడ్లు తెగిపోయినా, ఉదృతంగా ప్రవహించినా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్,బారిగేడ్స్,హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రతి పోలీస్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల అలుగుల దగ్గర, ప్రధాన రహదారులపై ప్రవహించే వాగులు, వంకల దగ్గర నీటి ప్రవాహం గురించి ముందస్తు సమాచారం తెలుసుకొని , ప్రత్యేక్షంగా వెళ్లి పర్యవేక్షించి పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు.వరద నీటికి చెరువులు, కుంటలు నిండి చెరువు కట్టలు తెగి పోయే ప్రమాదం ఉంటుంది.

కావున ప్రజలు అప్రమత్తం గా ఉండగలరు.వాహనదారులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ప్రయాణించండి.

వర్షానికి రోడ్లు కొట్టుకుపోయి , గుంతలు ఏర్పడి అందులో నీరు నిల్వ ఉండి ఆ గుంతలు వాహనదారులకు కనిపించక ప్రమాదానికి గురి అయ్యి ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది.కావున జాగ్రత్తగా, నెమ్మదిగా చూసుకొని ప్రయాణించండి.

వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదు అని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube