యువత చెడు వ్యాసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలవైపు సాగాలి.

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District ):దోస్తీ మీట్ – 2024 మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీల్లో గెలుపోయిందిన జట్లతో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన పోటీలకు ముఖ్య అతిదిగా హాజరై బహమతులు అందజేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.మండల స్థాయిలో గెలుపొందిన 17 కబడ్డీ జట్లు,12 వాలిబల్ జట్లు జిల్లా స్థాయిలో పాల్గొనడం జరిగింది.

 Youth Should Stay Away From Bad Articles And Move Towards Higher Goals , Rajann-TeluguStop.com

కబడ్డీ ఫైనల్ మ్యాచ్( Kabaddi final match ) లో వేములవాడ రూరల్,వీర్నపల్లి జట్లు పాల్గొనగా

1.మొదటి ప్లేస్ : వేములవాడ రూరల్ టీమ్ 2.రెండవ ప్లేస్: వీర్నపల్లి టీమ్ 3.మూడవ ప్లేస్ : రుద్రంగి

వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ లో వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట్ జట్లు పాల్గొనగా.

1.మొదటి ప్లేస్ : రుద్రంగి 2.రెండవ ప్లేస్ :ఎల్లారెడ్డిపేట్ బి టీం 3.మూడవ ప్లేస్: ఎల్లారెడ్డిపేట్ A టీమ్

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉంటుందని, చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, అదే ఉద్దేశ్యంతో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా జిల్లాలో యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు,మాధకద్రవ్యాల వలన కలుగు అనార్దలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి మండల స్థాయిలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దోస్తీ మీట్ – 2024 లో భాగంగా కబడ్డీ వాలీబాల్ పోటీలు నిర్వహించి మండల స్థాయిలో గెలుపోయిందిన జట్లకు జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు.

యువత చదువుతో పాటుగా అన్ని రంగాల్లో రాణించాలని, క్రీడల్లో ప్రతి ఒక్కరు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని, అదే స్ఫూర్తి ని నిజ జీవితంలో అలవర్చుకుంటు ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు.క్రీడలలో పాల్గొనడం వల్ల శారీరకంగా, ఆరోగ్యం గా దృడంగా ఉండడంతో పాటు మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని అన్నారు.

నిజ జీవితంలో సమిష్టి కృషి తోనే విజయాలను సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని అన్నారు.క్రీడ ఓటమి చెందిన వారు తమ లోపాలను సవరించుకొని ముందుకు వెళ్లడం అలవర్చుకోవాలని అన్నారు.

ఎస్పీ వెంట వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి( ASP Seshadrini Reddy), అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు కృష్ణ,మోగిలి,శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ ఆర్.ఐ లు మాధుకర్, యాదగిరి, రమేష్ , ఎస్.ఐలు సిబ్బంది ,వ్యాయామ ఉపాద్యాయులు, క్రీడాకారులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube