స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిధులతో చేపట్టిన పనులను త్వరితగతిన ఈ నెలాఖరులోగా పూర్తి చేయించాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా : స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మొదటి విడతగా మంజూరైన ఒక కోటి 55 లక్షల రూపాయల నిధులతో ఎల్లారెడ్డిపేట మండలంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డిలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరారు.ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ధోమ్మాటి నరసయ్య పాల్గోన్నారు, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు పూర్తిగాని పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయించాలని వారు కార్యకర్తలకు నాయకులకు సూచించారు.

 The Works Undertaken With The Funds Of Special Development Fund Should Be Comple-TeluguStop.com

ఈ నెలాఖరులోగా రెండవ విడుత మంజూరయ్యే నిధులతో ప్రజలకు అవసరమున్న చోటే కొత్త పనులను గుర్తించి అభివృద్ధికి ప్రాదాన్యత ఇద్దామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు చర్చించుకున్నారు.మొదటి విడత పనులు పూర్తి చేయకపోతే రెండవసారి వచ్చే నిధులు ఇవ్వడం కుదరదు అన్నారు.

మండలంలో,గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల తో ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నందున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వపరంగా వారు గుర్తించుకునే విధంగా పనులు చేసి పెట్టాలని వారు కోరారు.

ఈ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు షేక్ గౌస్ బాయి , గిరిధర్ రెడ్డి , మేడిపల్లి దేవానంద్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్ని బాబు, నాయకులు గుర్రపు రాములు, బండారి బాల్ రెడ్డి, గంట బుచ్చాగౌడ్ , కొత్త పల్లి దేవయ్య, సూడిది రాజేందర్, బానోత్ రాజు నాయక్, గుండా డి రాం రెడ్డి , రఫీక్, రవి , సిరిపురం మహేందర్, పందిర్ల శ్రీ నివాస్ గౌడ్, అందె సతీష్ శ్రీనివాస్, కిష్టారెడ్డి, పొన్నాల తిరుపతి రెడ్డి, మామిండ్ల కిషన్, బాలయ్య, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube