సిరిసిల్లకు చెందిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు

బాల సాహిత్యంలో సేవ కు గానూ గుర్తింపుఅంతర్జాతీయ మ‌హిళా దినోత్సవం సందర్బంగా అందజేయనున్న ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా :అంతర్జాతీయ మ‌హిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు తెలంగాణ‌ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.పలు రంగాలకు చెందిన మొత్తం 27 మందిని ఈ స్పెషల్ అవార్డులకు ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భార‌తి హోళీకేరి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

 State Government Award To Dr. Kandepi Rani Prasad ,womens Day , Dr. Kandepi Rani-TeluguStop.com

ఈ ఏడాది (2023) కు గానూ మొత్తం 27 మంది మహిళలను అవార్డుతో పాటు ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని సర్కార్ అందజేయనుంది. సిరిసిల్ల చెందిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్ కు ఎంపికైంది.

సాహిత్యంలో ఆమె చేసిన సేవ కు గానూ ఈ గుర్తింపు లభించింది.ప్రముఖ రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ తో పాటు అవార్డులు పొందిన మ‌హిళ‌లు వీరే.

బానోతు జ్యోతి – అంగ‌న్‌వాడీ టీచ‌ర్ , ఎం.కృష్ణవేణి – ఆశా వ‌ర్కర్ , ఇందిర – ఏఎన్ఎం , గుండా రాజ‌కుమారి – సెంట‌ర్ కోఆర్డినేట‌ర్, భ‌రోసా సెంట‌ర్ ఆల్ఫి కిండ‌న్‌జెన్ – సోష‌ల్ స‌ర్వీస్ , మీనాక్షి గాడ్గె – ముఖ్రా కే స‌ర్పంచ్ , డాక్టర్ అనురాధ త‌డ‌క‌మ‌ళ్ల – క్లాసిక‌ల్ డ్యాన్స్ , దంటు క‌న‌క‌దుర్గ – సోష‌ల్ యాక్టివిస్ట్ , సుజాత దీక్షిత్ – థియేట‌ర్ , స్వరూప పొట్లప‌ల్లి – జ‌ర్నలిజం , డాక్టర్ బండారు సుజాత శేఖ‌ర్ – ఫోక్ లిట‌రేచ‌ర్ , క‌ర్నె శంక‌ర‌మ్మ – కిన్నెర‌, ఫోక్ అరుణ నార‌ద‌భ‌ట్ల – లిట‌రేచ‌ర్ , డాక్టర్ అమూల్య మ‌ల్లన్నగారి – హెల్త్ , నారా విజ‌య‌ల‌క్ష్మి (పీహెచ్) – పెయింట‌ర్ , ఓఎన్ఐ సిస్టర్స్(వినోద‌, విజ‌య‌, విజ‌య‌ల‌క్ష్మి) – మ్యూజిక్, త్రిష గొంగ‌డి – స్పోర్ట్స్ (అండ‌ర్ -19 క్రికెట‌ర్) , డాక్టర్ మాల‌తి – హెల్త్, సూప‌రింటెండెంట్, ఎంజీఎంహెచ్, పేట్ల‌బుర్జ్ , స‌మంత రెడ్డి – ఉమెన్ ఎంట‌ర్‌ప్రెన్యూర్ , డాక్టర్ గుడూరు మ‌నోజ – ఆద్య క‌ళ‌ , సామ‌ళ్ల శ్వేత – క‌మ్యూనిటీ మొబిలైజేష‌న్ జి.నందిని – సూప‌ర్‌వైజర్, నిజామాబాద్ (అ) ప్రాజెక్ట్ ,ర‌జియా సుల్తానా – ఏడబ్ల్యూహెచ్, కౌడిప‌ల్లి, ఐసీడీఎస్ – న‌ర్సాపూర్ ,రుక్మిణి, ఇన్‌స్పెక్టర్ – షీ టీమ్స్ భ‌రోసా సెంట‌ర్ , అన‌సూయ‌, ఐపీఎస్, డీసీపీ – పోలీసు డిపార్ట్‌మెంట్ ,అన్వితా రెడ్డి – మౌంటెయిన‌ర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube