సిరిసిల్లకు చెందిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డు
TeluguStop.com
బాల సాహిత్యంలో సేవ కు గానూ గుర్తింపుఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా అందజేయనున్న ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.
పలు రంగాలకు చెందిన మొత్తం 27 మందిని ఈ స్పెషల్ అవార్డులకు ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళీకేరి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ఏడాది (2023) కు గానూ మొత్తం 27 మంది మహిళలను అవార్డుతో పాటు ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని సర్కార్ అందజేయనుంది.
సిరిసిల్ల చెందిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ కు రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్ కు ఎంపికైంది.
సాహిత్యంలో ఆమె చేసిన సేవ కు గానూ ఈ గుర్తింపు లభించింది.ప్రముఖ రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ తో పాటు అవార్డులు పొందిన మహిళలు వీరే.
బానోతు జ్యోతి – అంగన్‌వాడీ టీచర్ , ఎం.కృష్ణవేణి – ఆశా వర్కర్ , ఇందిర – ఏఎన్ఎం , గుండా రాజకుమారి – సెంటర్ కోఆర్డినేటర్, భరోసా సెంటర్
ఆల్ఫి కిండన్‌జెన్ – సోషల్ సర్వీస్ , మీనాక్షి గాడ్గె – ముఖ్రా కే సర్పంచ్ , డాక్టర్ అనురాధ తడకమళ్ల – క్లాసికల్ డ్యాన్స్ , దంటు కనకదుర్గ – సోషల్ యాక్టివిస్ట్ , సుజాత దీక్షిత్ – థియేటర్ , స్వరూప పొట్లపల్లి – జర్నలిజం , డాక్టర్ బండారు సుజాత శేఖర్ – ఫోక్ లిటరేచర్ , కర్నె శంకరమ్మ – కిన్నెర, ఫోక్ అరుణ నారదభట్ల – లిటరేచర్ , డాక్టర్ అమూల్య మల్లన్నగారి – హెల్త్ , నారా విజయలక్ష్మి (పీహెచ్) – పెయింటర్ , ఓఎన్ఐ సిస్టర్స్(వినోద, విజయ, విజయలక్ష్మి) – మ్యూజిక్, త్రిష గొంగడి – స్పోర్ట్స్ (అండర్ -19 క్రికెటర్) , డాక్టర్ మాలతి – హెల్త్, సూపరింటెండెంట్, ఎంజీఎంహెచ్, పేట్లబుర్జ్ , సమంత రెడ్డి – ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ , డాక్టర్ గుడూరు మనోజ – ఆద్య కళ , సామళ్ల శ్వేత – కమ్యూనిటీ మొబిలైజేషన్
జి.
నందిని – సూపర్‌వైజర్, నిజామాబాద్ (అ) ప్రాజెక్ట్ ,రజియా సుల్తానా – ఏడబ్ల్యూహెచ్, కౌడిపల్లి, ఐసీడీఎస్ – నర్సాపూర్ ,రుక్మిణి, ఇన్‌స్పెక్టర్ – షీ టీమ్స్ భరోసా సెంటర్ , అనసూయ, ఐపీఎస్, డీసీపీ – పోలీసు డిపార్ట్‌మెంట్ ,అన్వితా రెడ్డి – మౌంటెయినర్.
అమెరికా రాష్ట్ర సభలు, లోకల్ బాడీల బరిలో ప్రవాస భారతీయులు .. ఎంత మందో తెలుసా?