రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గౌడ సంఘం నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గౌడ సంఘం అధ్యక్షుడిగా కొండ స్వామి గౌడ్, ఉపాధ్యక్షుడిగా కొoడ పెద్దనరసయ్య గౌడ్,ప్రధాన కార్యదర్శిగా పందిల్ల రవికాంత్ గౌడ్,కోశాధికారిగా ఆకుల నాగభూషణంగౌడ్, సలహాదారులుగా, పాముల లక్ష్మణ్ గౌడ్, పందిల్ల గణపతిగౌడ్, కొండ చిన్న నర్సయ్యగౌడ్,
పందిల్ల శ్రీనివాస్ గౌడ్,తీగల చిన్న అంజాగౌడ్,తీగల దశరథం గౌడ్ లు ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగానూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి పాటుపడతామని , గౌడ సోదరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఎన్నికకు సహకరించిన కుల సభ్యులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.