కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఎల్లారెడ్డిపేట మండల హడక్ కమిటీ మండల అధ్యక్షుడు ఎడ్ల సందీప్ ఆధ్వర్యంలో డా.బి.ఆర్.అంబేద్కర్ పై పార్లమెంటులోనీ వ్యాఖ్యలకు నిరసనగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ఎడ్ల రాజ్ కుమార్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రొడ్డ రామచంద్రం మాట్లాడుతూ అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అనడం ఫ్యాషన్ అయిపోయిందని, అదేదో దేవుని పేరు స్మరిస్తే ఏడు జన్మల పుణ్యం వస్తుంది అన్నటువంటి అమిత్ షా ఈ 15 ఏండ్ల మీ అధికారం ఆయన పేరు స్మరణతోనే వచ్చిందని మరిచావా.నీ మంత్రి పదవి ఆయన రాసిన రాజ్యాంగం వల్లే వచ్చిందని మరిచావా అని అన్నారు .2000 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఎస్సీ, ఎస్టి, బిసి, మైనార్టీలకు ఆ దేవుని పేరు తలచిన కనీస నీరు తాగే హక్కు కూడా లేదని ఆ హక్కును ఇచ్చింది దేవుడు కాదు మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని మరిచావా.ఈరోజు భారతదేశంలో మెజార్టీ ప్రజలు మీ మనువాద సంకెళ్లు తెంపుకొని స్వేచ్ఛ, సమానత్వ, సౌబ్రాతృత్వ జీవిస్తున్నారంటే కారణం ఆయన అని మరిచావా.

 Burning Effigy Of Union Home Minister Amit Shah, Burning Effigy ,union Home Mini-TeluguStop.com

అధికారంలోకి వచ్చిన నాటినుండి నేటి వరకి ఆయన పేరును, ఆయన ఆశయాలను తొలగించాలని ప్రయత్నించిన మీ ప్రయత్నాలు తొలగించలేకపోయాం అన్నటువంటి నిస్సహాయ స్థితిలో నువ్వే పార్లమెంట్ సాక్షిగా ఆయన పేరును ఏడుసార్లు జపించి నీ జన్మనే స్మార్థకథ చేసుకున్నామని మరిచిపోకు.నీకు, నీ పార్టీకి డా.బి.ఆర్.అంబేద్కర్ అన్న ఆయన రాజ్యాంగమన్న నచ్చకనే పార్లమెంటు స్థాపన కార్యక్రమానికి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వాడనే అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి ఆహ్వానం లేకుండా కార్యక్రమం జరిపావు.నేడు అయోధ్య ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమానికి గిరిజన సామాజిక వర్గానికి చెందిన ఇప్పటి రాష్ట్రపతి అయిన ద్రౌపతి ముర్మ్ కి ఆహ్వానం లేకుండా కార్యక్రమం జరిపావు.

నీకు భారతదేశంలో డా.బి.ఆర్.అంబేద్కర్ స్వేచ్ఛ ఇచ్చినటువంటి ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనారిటీ నచ్చక, వారు వారి హక్కుల కోసం డా.బి.ఆర్.అంబేద్కర్ పేరును పలకడం నీకు నచ్చక పోతే అన్ని మూసుకొని ఇంట్లో పండు కానీ ఇలా అపహస్యంగా, వ్యంగంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.

నువ్వు అంబేద్కర్ పాదాలకు నమస్కరించి క్షమాపణ చెప్పకుంటే రాబోయే రోజుల్లో మీ పార్టీ కార్యాలయాలను, మీ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీల ఇల్లులను ముట్టడిస్తామని రాబోవు రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల హడక్ కమిటీ కన్వీనర్లు లింగాల సందీప్, పాటి నరసింహులు, నీరటి భాను, అంబటి రవి, గడ్డం జితేందర్, రామిండ్ల డేవిడ్, కొర్రె అనిల్, రేసు శంకర్, జీడి శ్రీనివాస్, రామిండ్ల దేవానందం, మంతుర్తి నరసింహులు, సుడిది రాజేందర్, గడ్డం వెంకటేష్, బుర్క రాజు, బుర్క రాకేష్, బంటు రాజు , సామల్ల సత్తయ్య, బత్తుల రాజేష్, గడ్డమీది సాయి చందు, పాశం రామకృష్ణ, క్యారం సురేష్, పాశం సాయి, పాశం ప్రశాంత్, గడ్డం నవీన్ , బత్తుల వినోద్, నరేందర్,వివిధ గ్రామ కమిటీల నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube