రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పరిధిలోని రైతులను సెస్ అధికారులు ఇబ్బంది పెట్టవద్దని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య శుక్రవారం తెలిపారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ రాచర్ల గొల్లపల్లి దేవుని గుట్ట తండా పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ లింకు పోయి నాలుగు రోజులు అవుతున్న అధికారులు పట్టించుకోలేదన్నారు.
దున్నిన దుక్కులు ఎండిపోవడం జరిగిందని రైతులు మా దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు.విషయాన్ని సెస్ ఏఈ దృష్టికి తీసుకెళ్లగా కొంతమంది వ్యవసాయదారుల మోటార్ల కనెక్షన్లను తొలగించడం జరిగిందన్నారు.
వ్యవసాయదారుల కనెక్షన్లను తొలగించడం మూలంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.పర్మిషన్ లేని విద్యుత్ వ్యవసాయ మోటార్లు ఉంటే రైతులకు నెల రోజుల ముందు నోటీసులు ఇచ్చి తొలగించాలని అన్నారు.
ప్రస్తుతం పొలాలు దున్నుకొని నాటుకు సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో వారి కనెక్షన్లను తొలగించి రైతులను ఇబ్బంది పాలు చేయవద్దని సెస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామ్ రెడ్డి,డైరెక్టర్ సూడిద రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, నాయకులు బానోతు రాజు నాయక్, భాస్కర్ ,బండారి బాల్ రెడ్డి,గండికోట రవి, మూన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.