వృద్ధుల డే కేర్ సెంటర్ ను తనిఖీ చేసిన ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్

వృద్ధులకు నాణ్యతతో కూడిన భోజనాన్ని ఇవ్వాలి.తల్లిదండ్రులతో సమానంగా చూసుకోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లా: వృద్ధులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని ఇవ్వాలని తల్లిదండ్రులతో సమానంగా చూసుకోవాలని ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ అధ్యక్షురాలు పిల్లి రేణుకా కిషన్ అన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వృద్ధుల డే కేర్ సెంటర్ ను ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్( MPP Pilli Renuka Kishan ) బుధవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని డే కేర్ సెంటర్ ను వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

 Mp Pilli Renuka Kishan Inspected The Day Care Center For The Elderly , Mpp Pilli-TeluguStop.com

ఈ రోజుల్లో ఆర్థికంగా ఉండి కూడా కొందరు వృద్ధులైన తల్లిదండ్రులను చూసుకోవడం లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుర్తించి ఎల్లారెడ్డిపేట( Yellareddipeta )మండల కేంద్రంలో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చే‌సినందుకు ఆమే కృతజ్ఞతలు తెలిపారు.వృద్ధుల డే కేర్ సెంటర్లోని హాజరు రిజిస్టర్ ను రేణుక పరిశీలించారు తొమ్మిది మంది వృద్ధులకు గాను ఏడుగురు వృద్ధులు మాత్రమే బుధవారం ఉన్నారు.

అదేవిధంగా డే కేర్ సెంటర్( Day care centre ) లోని సిబ్బంది రిజిష్టర్ ను పరిశీలించారు కోఆర్డినేటర్ మమతా , ఎఎన్ఎం సుజాత, కుక్కర్ మమత మల్టీటాస్క్ కొమురయ్య లు డ్యూటీ లో ఉన్నట్లు గుర్తించారు.

బుధవారం మధ్యాహ్నం వృద్ధులకు వడ్డించిన అన్నం కూరలను పరిశీలించి ప్రతి రోజూ ఎలా వడ్డిస్తున్నారని అన్నం కూరలు ఎలా ఉంటున్నాయని వృద్ధులను ఎంపిపి పిల్లి రేణుక కిషన్ అడిగితెలుసుకున్నారు, వారు బాగానే వుంటున్నాయని బాగానే తమను చూసుకుంటున్నారని వృద్దులు సంతృప్తికరమైన మాటలతో విలేకరుల ఎదుటనే ఎంపిపి పిల్లి రేణుక కిషన్ కు వారు చెప్పుకున్నారు, బుధవారం ఉదయం ఉప్మా , మధ్యాహ్నం వేడి అన్నంతో ఆలుగడ్డ కర్రి , పెరుగు, పచ్చి పులుసు లతో వృద్ధులకు నాణ్యతతో భోజనం ఇచ్చామని సాయంత్రం కూడా వేడి అన్నంతో పాటు కూరగాయలతో వండిన కర్రి ఇవ్వడం జరుగుతుందన్నారు, ఎంపిపి వెంట ఎంపిటీసీ సభ్యురాలు ఎలగందుల అసూయ, బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, మండల మాజీ కోఆప్షన్ సభ్యులు హాసన్ బాయి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు భూక్యా సిత్యానాయక్, గోషిక దేవదాస్ లున్నారు,

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube