నాలుగు ఏళ్ల నరకమంటూ వీడియో రిలీజ్ చేసిన చంద్రబాబు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా రసవతారంగా ఉంటున్నాయి.వచ్చే ఎన్నికలను ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది.

 Chandrababu Released A Video Of Four Years Of Hell Chandrababu, Ys Jagan, Tdp ,-TeluguStop.com

ఎట్టి పరిస్థితులలో వచ్చే ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఎవరికివారు తమ వ్యూహాలను వేసుకుంటూ దూసుకుపోతున్నారు.ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ పార్టీ( TDP )కి చెందిన కీలక నాయకులు నిత్యం ప్రజలలో ఉంటూ ప్రశ్నించాల్సిన విషయంలో ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

ఈ క్రమంలో చంద్రబాబు( Chandrababu Naidu ) తన ట్విట్టర్ లో నాలుగేళ్ల నరకమంటూ వైసీపీ పాలనపై వీడియో రిలీజ్ చేశారు.

“ఎంత సున్నితంగా మాట్లాడటానికి ప్రయత్నించినా, కరుణామయుడిలా మరెంత నటించినా, లోపలున్న క్రూరమైన వ్యక్తిత్వం బయటపడుతూనే ఉంటుంది.ఆ వ్యక్తిత్వమే తన అనుచరులకు మార్గదర్శకత్వం అవుతుంది.అదే రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తుంది”.

అని పోస్ట్ పెట్టి చంద్రబాబు వీడియో రిలీజ్ చేశారు.ఆ వీడియోలో వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా( CM Jagan ) ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్న హత్యలు.

ఇంకా అనేక విషయాలను చూపించడం జరిగింది.నాలుగేళ్ల నరకం అంటూ చంద్రబాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube