యాపిల్.అద్భుతమైన పండ్లలో ఇది ఒకటి.
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో సైతం యాపిల్ ఖచ్చితంగా ఉంటుంది.మంచి రుచిని కలిగి ఉండటంతో పాటు విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు యాపిల్‌లో పుష్కలంగా నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్య పరంగా యాపిల్ అనేక ప్రయోజనాలను అందిస్తుంది.అయితే ఆ ప్రయోజనాలు తినే సమయం బట్టి కూడా ఆధారపడి ఉంటాయి.
ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్‌ను తింటే ఎక్కువ లాభాలు పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మరి ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
ప్రస్తుత రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు.అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడంలో యాపిల్ సూపర్‌గా హెల్ప్ చేస్తుంది.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాపిల్‌ను తింటే అందులోని ఫైబర్ కంటెంట్ ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది.చిరు తిండ్లపై మనసు మల్లకుండా చేస్తుంది.
ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.
అలాగే ఉదయాన్నే పరగడుపున యాపిల్‌ను తినడం వల్ల.
అందులో ఉండే విటమిన్ `సి` ని శరీరం త్వరగా గ్రహిస్తుంది.తద్వరా రోగ నిరోధక వ్యవస్థ బలపడి.వివిధ రకాల జబ్బులు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అధిక రక్తపోటుతో బాధ పడే వారు ఖాళీ కడుపుతో యాపిల్‌ను తింటే చాలా మేలని అంటున్నారు.

ఎందుకంటే, యాపిల్‌లో ఉండే పలు పోషకాలు రక్తపోటు స్థాయిలను అదుపులోకి తీసుకువస్తాయి.అదే సమయంలో గుండె జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గిస్తాయి.అంతేకాదు, ఖాళీ కడుపుతో యాపిల్‌ను తింటే మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.శరీరంలో వాపులు తగ్గుతాయి.మెదడు చురుగ్గా పని చేస్తుంది.మరియు శరీరం రోజంతా యాక్టివ్‌గానూ ఉంటుంది.