రాజన్న సిరిసిల్ల జిల్లా : కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్నను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద( Nerella Sharada, Rajanna ).కమిషన్ చైర్ పర్సన్ దంపతులకు ఆలయ అర్చకులు,ఈఓ కె .
వినోద్ రెడ్డి పూర్ణకుంభ స్వాగతం పలికారు.
స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామివారి కల్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనము చేశారు.
ఆలయ ఈఓ కే .వినోద్ రెడ్డి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందించారు.వీరి వెంట ఆలయపర్యవేక్షకులు బి తిరుపతిరావు ఉన్నారు.