తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు.అందులో ఎనర్జిటిక్ స్టార్ గా తనకంటూ ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న హీరో మాత్రం రామ్( Hero Ram ) ఒక్కరే…ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించాయి.
అయితే ప్రస్తుతం ఆయన చేసిన డబుల్ ఇస్మార్ట్ సినిమా( Double Ismart ) భారీ ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఆయన తన తదుపరి సినిమాని ఎవ్వరితో చేస్తున్నాడు అనే దాని మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.
ఇక ఇప్పటికే కొంతమంది స్టార్ డైరెక్టర్లు కూడా అతనితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తున్నప్పటికి ఆయన మాత్రం చాలా ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పుడు చేయబోయే సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తేనే ఆయనకంటూ ఒక మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది.లేకపోతే మాత్రం పాన్ ఇండియాలో( Pan India ) కూడా ఆయనకున్న అంతో ఇంతో మార్కెట్ అనేది పూర్తిగా క్లోజ్ అవుతుందనే చెప్పాలి.
ఇక దానికోసమే మహేష్ బాబు డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇంతకీ మహేష్ బాబు( Director Mahesh Babu ) ఎవరు అంటే అనుష్క, నవీన్ పోలిశెట్టిలను పెట్టి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమాను చేసి మంచి విజయాన్ని దక్కించుకున్న దర్శకుడే మహేష్ బాబు…
మరి ఈయన రామ్ ఇమేజ్ కి తగ్గట్టుగా మంచి కథను తయారు చేసి అతనికి భారీ సక్సెస్ ని అందిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది… ఇక ఏది ఏమైనా కూడా హీరోలకు క్రేజ్ రావాలంటే సక్సెసులు అనేవి చాలా కీలకపాత్ర వహిస్తూ ఉంటాయి… అందువల్లే ఇక్కడ ప్రతి ఒక్కరు టార్గెట్ కూడా సక్సెస్ కావడం విశేషం.మరి వీళ్ళు అనుకున్న సక్సెస్ ని సాధిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది
.