రామ్ చరణ్( Ram Charan ) శంకర్( Shankar ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమాపై కాంబినేషన్ సెట్ అయిన సమయంలో ఏర్పడిన స్థాయిలో అంచనాలు ఆ తర్వాత ఏర్పడలేదు.ఇండియన్2 సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం శంకర్ మార్కెట్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపింది.అయితే గేమ్ ఛేంజర్ టీజర్ కు సంబంధించిన అప్ డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం అదిరిపోయింది.
నవంబర్ నెల 9వ తేదీన గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ కానుండగా ఆ టీజర్ తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ రానుంది.
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా నవంబర్ నెలలోనే మిగిలిన పాటలు రిలీజ్ కానున్నాయి.డిసెంబర్ నెలను కేవలం ప్రమోషన్స్ కోసమే కేటాయించనున్నారని తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాదికి వాయిదా పడినా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కు వాయిదా వేయడమే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో సైతం అదరగొడుతోందని తెలుస్తోంది.ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు కూడా భారీగా ఉండే ఛాన్స్ అయితే ఉంది.గేమ్ ఛేంజర్ దీపావళి అప్ డేట్( Game Changer Deepavali Update ) మాత్రం అదిరిపోయిందని చెప్పవచ్చు.
రామ్ చరణ్ వరుసగా బాలీవుడ్ బ్యూటీలకు ఓటేస్తుండగా చరణ్ కియారా అద్వానీ( Kiara Advani ) ఫ్లాప్ సెంటిమెంట్ ను ఈ సినిమాతో బ్రేక్ చేస్తారేమో చూడాలి.రామ్ చరణ్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉండగా తర్వాత ప్రాజెక్ట్ లతో చరణ్ భారీ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.గేమ్ ఛేంజర్ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కడం గమనార్హం.దిల్ రాజు బ్యానర్ కు గేమ్ ఛేంజర్ సక్సెస్ సాధించడం ఎంతో ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.