ప్రవేట్ కంపెనీల యందు జాబ్ కొరకు పత్రక ప్రకటన తేదీ 22-08-2024 రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు తెలియజేయునది ఏమనగా ప్రముఖ కంపెనీల యందు ఉద్యోగాలు కల్పించేందుకు తేదీ 25-08-2024 నాడు డిస్ట్రిక్ట్అడ్మినిస్ట్రేషన్ రాజన్న సిరిసిల్ల అద్వర్యంలో వేములవాడ, మహా లింగేశ్వర గార్డెన్ నందు, (రెండవ బై పాస్, RELIANCE MART ఎదురుగా) మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే వేములవాడ గారు తెలిపారు.ఎస్ఎస్ సి/ ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు రూపాయలు 12000 ల నుండి 40000 రూపాయల వరకు వేతనం ఉంటుందని తెలిపారు.
ఇట్టి మెగా జాబ్ మేళా యందు హైదరాబాద్ కరీంనగర్, సిరిసిల్ల మరియు వేములవాడ కు చెందిన ప్రముఖ కంపనీలు పాల్గొంటున్నాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అర్హత, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాఫీలతో రాజన్న సిరిసిల్ల జిల్లా లోని వేములవాడ, మహా లింగేశ్వర గార్డెన్ నందు తేదీ.రోజున 25-08-2024 ఉదయం 10.00 గంటలకు జరుగు మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకులు హాజరుకావాల్సిందిగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు.మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన 5.3.9963357250, 9885346768.DEE, SIRCILLA.