తెలంగాణ ప్రభుత్వ గొప్ప నిర్ణయం : అరుణా రాఘవ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా

: ఇంటిని చక్కదిద్దే మహిళ ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఇంటా సౌభాగ్యం ఉంటుందని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు.మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం సిఎం కేసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు.

 Great Decision Of Telangana Govt ,aruna Raghava Reddy , Rajanna Sirisilla Distr-TeluguStop.com

ఆరోగ్య మహిళా కేంద్రాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం అని… ఈ కేంద్రాలు మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో దోహదం చేస్తుందన్నారు.బుధవారం పి సుందరయ్య నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్య మహిళ కేంద్రాన్ని జిల్లా ప్రజా పరిషత్, చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి లతో కలిసి ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం మహిళా ఆరోగ్యం కేంద్రాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ,మంత్రి కే తారక రామారావుకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ మహిళా లోకం రుణపడి ఉంటుందని, వెన్నంటి ఉంటుందని ఆమె తెలిపారు.

తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేసిఆర్ కిట్, అమ్మ ఒడి ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల, తంగళ్లపల్లి, సిరిసిల్ల పి సుందరయ్య నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.

ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తారని… అవసరమైన చికిత్సలను కూడా అందించడం జరుగుతుందన్నారు .ఈ ఆరోగ్య కేంద్రాలను జిల్లా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు : జిల్లా కలెక్టర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు.

మహిళల సమగ్ర అరోగ్య పరిరక్షణ కోసం నేరెళ్ళ, తంగళ్ళ పల్లి, సిరిసిల్ల సుందరయ్య నగర్ పీహెచ్‌సి , వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.దవాఖానల్లో ప్రతి మంగళవారం ప్రత్యేకంగా వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు.

మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందిస్తామ ని చెప్పారు.మహిళలకు పరీక్షలను నిర్వహించి పేషంట్ రికార్డ్ మాన్యువల్ గానే కాకుండా, డిజిటల్ విధానంలోనూ పొందు పరిచి ప్రత్యే క యాప్‌ ద్వారా మానిటరింగ్‌ చేస్తామని తెలిపారు.

ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైతే రెఫర్‌ చేస్తారని చెప్పారు.జిల్లా ఆసుపత్రిలో వారి కి సాయం చేసేందుకు ప్రత్యేక హెల్ప్‌ డెస్క్ ఉంటుందన్నారు.

ఇలా ఆమెకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు.ఈ విషయంపై మెప్మా, మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ఇప్పటివరకూ చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలను ఈ ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్లకు వివరించి, పరీక్షలు, చికిత్స పొందేలా మహిళల్లో చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ.

మహిళ ఆరోగ్య పరిరక్షణ కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఆలోచించి ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు.ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేసిన సీఎం, మంత్రి కేటీఆర్ కు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్,జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్ పర్సన్ లు వైద్యులతో కలిసి టీబీ నీ అంతం చేద్దాం అనే ప్లకార్డులను ప్రదర్శించారు.కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు జిల్లా ఉప వైద్యాధికారులు డా శ్రీరాములు, డా రజిత, టీబీ విభాగం జాయింట్ డైరెక్టర్ డా రాజేష్, ఎన్ సి డి జిల్లా సమన్వయ కర్త క్రిష్ణ మూర్తి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు , పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube