అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఎల్.ఓ.
సి అందజేతరాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గంగం చిన్నారెడ్డి అనే వ్యక్తి గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ క్రమంలో నిరుపేదలైన చిన్నారెడ్డి కుటుంబ సభ్యులు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వైద్యానికి అయ్యే ఖర్చులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయం స్థానిక జడ్పీటీసీ గట్ల మీనయ్య ద్వారా తెలుసుకున్న బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు వెంటనే స్పందించి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సహకారంతో వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1,00,000 (ఒక లక్ష రూపాయల) ఎల్ఓసి మంజూరు చేయించారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ మీనయ్య మాట్లాడుతూ తమ గ్రామం వారు ఆపదలో ఉన్నారని తెలిసి, వైద్య ఖర్చుల నిమిత్తం సాయం అందించాలని కోరగా వెంటనే స్పందించి ఒక్క రోజులోనే ఆర్థిక సాయం అందేలా కృషిచేసిన చల్మెడ లక్ష్మీనరసింహారావుకు తన తరపున,బాధిత కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.