జిల్లా ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా వైభవోపేతంగా తెలంగాణ అవతరణ ద‌శాబ్ది ఉత్స‌వాలు

జిల్లా ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా వైభవోపేతంగా తెలంగాణ అవతరణ ద‌శాబ్ది ఉత్స‌వాలు జూన్ 2 నుంచి 22 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్యక్రమాలు రోజు వారి కార్యక్రమాల కు సమన్వయ అధికారుల నియామకం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజన్న సిరిసిల్ల జిల్లా :రాజన్న సిరిసిల్ల జిల్లా దశాబ్ది ప్రగతి తో పాటు తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని.చాటేలా జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో వైభవోపేతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు.

 Telangana Awatarana Decade Festival Celebrated To Show The Progress Of The Distr-TeluguStop.com

వచ్చే నెల జూన్ 2 నుంచి 22 వరకు జిల్లాలో జరుగు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామల నుంచి జిల్లా స్థాయి వరకు.ఏ రోజు ఏ కార్యక్రమం చేపట్టాలో, కార్యక్రమాలను సమన్వయం చేసే అధికారిని సూచిస్తూ, చేపట్టాల్సిన కార్యక్రమాల పై దిశానిర్దేశం చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు.ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరనీ సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణం లో నిర్వహించి.

విజయవంతం చేయాలని సూచించారు.ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వచ్చే నెల జూన్ 2 నుంచి 22 వరకు చేపట్టనున్న కార్యక్రమాల వివరాలు ఇవే .

జూన్ 2 వ తేది – శుక్రవారం:ప్రారంభోత్సవం • రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్య శాఖా మంత్రి సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తారు.• సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రి చే పతాకావిష్కారణ, దశాబ్ది ఉత్సవ సందేశాన్ని ఇస్తారు.ముఖ్య ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణాల లోని ప్రధాన కూడళ్ల ను అలంకరించాలి.

జూన్ 3 వ తేది – శనివారం :తెలంగాణా రైతు దినోత్సవం •రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని 57 రైతు వేదికల క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతుల సమావేశం నిర్వహించాలి.ఈ సమావేశం జాతీయ గీతాలాపనతో ప్రారంభం అయ్యేలా చూడాలి.

•రైతు వేదికలను మామిడి తోరణాలు, పువ్వులు, సీరియల్ బల్బులతో అలంకరించాలి.రైతు వేదికల ప్రాంగణాల్లోనూ, హాల్ లోపల, క్లస్టర్ పరిధిలో వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలపై ప్లెక్సీలు/పోస్టర్లు ఏర్పాటు చేయాలి.

క్లస్టర్ పరిధిలో గల ఉత్తమ రైతులను ప్రోత్సహించడం కోసం సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలి.సభలో రైతుబంధు సమితుల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు, ప్యాక్స్ చైర్మన్లు, వ్యవసాయ, హార్టికల్చర్, మండల స్థాయిలోని వివిధ శాఖల అధికారులు, నాయకులు అందరూ పాల్గొనేలా చూడాలి.

రాష్ట్ర వ్యవసాయ శాఖ ద్వారా పంపిణి చేయు పోస్టర్ గాని, పాంప్లెట్లో గాని వ్యవసాయ రంగంలో జరిగిన సంపూర్ణ ప్రగతిని వివిధ పథకాల (ఉచిత విద్యుత్తు, రైతుబంధు మొదలైన) వాటికింద ఒక్కో రైతుకు కలిగిన లబ్దిని వివరిస్తూ ఆ క్లస్టర్ లోని గ్రామాలకు వ్యవసాయ శాఖ ద్వారా వచ్చిన నిధుల గురించి వివరించాలి.రైతు బీమా లబ్దిదారులతో వారి కుటుంబానికి కలిగిన మేలును గురించి సభలో మాట్లాడాలి.

రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించిన ప్రకారం రైతులందరితో సామూహిక భోజనం ఏర్పాటు చేయాలి.

జూన్ 4 వ తేది – ఆదివారం :సురక్షా దినోత్సవం •జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ కార్స్, బ్లూ కోల్ట్స్ , ఫైర్ వెహికిల్స్ తదితరాలతో ర్యాలీ నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలి.రెండు పట్టణాల్లో సాయంత్రం ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బందితో సభ నిర్వహించాలి.అనంతరం బడా ఖాన నిర్వహించాలి.కార్యక్రమ సమన్వయ అధికారి :సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్).

జూన్ 5 వ తేది – సోమవారం :తెలంగాణా విద్యుత్తు విజయోత్సవం

* తెలంగాణ విద్యుత్ విజయోత్సవం నియోజకవర్గ స్థాయిలో రైతులు వినియోగదారులు విద్యుత్తు ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలి విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరించాలి.సెస్ పరిధిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించాలి.సమావేశంలో విద్యుత్ రంగంలో సాధించిన గుణాత్మక మార్పును వివరించాలి.•అన్ని సబ్ స్టేషన్లను, ఇతర విద్యుత్ కార్యాలయాలను సీరియల్ బల్బులతో (21 రోజుల పాటు ఉండేలా) పూల తోరణాలతో అధ్బుతంగా అలంకరించాలి.ప్రతీ గ్రామంలో విద్యుత్ కు సంబంధించిన విషయాలు తెలియజేసే ప్లెక్సీ నాడు – నేడు పద్ధతిలో ఏర్పాటు చేయాలి.

విద్యుత్ రంగంలో సెస్ పరిధిలో సాధించిన విజయాల గురించి బుక్ లెట్ నివేదిక తయారు చేసి పంపిణీ చేయాలి.గ్రామంలో ఉన్న మొత్తం కనెక్షన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చిన కొత్త కనెక్షన్స్, ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం వెచ్చించిన మొత్తం నిధులు మొదలైనవి తెలియజేయాలి.

ఇతర రంగాలకు నిరంతరాయంగా ఇస్తున్న విద్యుత్ వలన జరిగే మేలు విషయం, దీని వల్ల గ్రామీణుల్లో వృత్తులు, వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగడం, గ్రామీణ జీవితంలో వచ్చిన సౌకర్యాలు మొదలైన విషయాలను పొందుపరచాలి.సౌర విద్యుత్ సెస్ పరిధిలో ఉత్పతి అవుతున్న వివరాలు తెలియజేయాలి.

విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేసిన తీరును, దీని కోసం చేసిన ఖర్చును మొదలైన విషయాలను తెలియజేయాలి.

జూన్ 6 వ తేది – మంగళవారం: తెలంగాణా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం •జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాలోని పారిశ్రామిక వేత్తలతో టెక్స్ టైల్ పార్క్, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమావేశాలు నిర్వహించాలి.ఈ సమావేశంలో పారిశ్రామిక రంగంలో సాధించిన ప్రగతిని ప్రకటించాలి.టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపన, అనుమతులు సులభతరమైన విషయాన్ని ప్రస్తావించాలి.

•కొత్త రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, టి-ప్రైడ్, టి-ప్రైడ్, టి-ఐడియా పథకాల గురించి వివరించాలి.స్టార్టప్ నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన టి-హబ్, టి-వర్క్స్, వి-హబ్, టాస్క్, రిచ్, టి ఎస్ ఐ ఐ సి ల గురించి వివరించాలి.

జూన్ 7 వ తేది – బుధవారం: సాగునీటి దినోత్సవం •సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గ కేంద్రాలలో ఒక్కో నియోజకవర్గ కేంద్రంలో 1000 మందితో సభ నిర్వహించాలి.ఈ సభకు రైతులు, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులను ఆహ్వానించాలి.

జిల్లాలోనూ,నియోజకవర్గంలోనూ ఇరిగేషన్ రంగంలో జరిగిన ప్రగతిని వివరించాలి.అత్యధిక శాతం నిధులు వెచ్చించి, బృహత్తరమైన ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించిన విషయం వెల్లడించాలి.

ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల, బహుళార్ధక సాధక కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్ల రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనతను ప్రముఖంగా తెలియజేయాలి.జిల్లాలో అత్యధిక సంఖ్యలో చెక్ డ్యాంల నిర్మించడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగిన విషయం తెలియజేయాలి.

కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణలో నేడు దాదాపు 85 లక్షల ఎకరాలకు సాగు నీటి సరఫరా జరుపుతూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ప్రభుత్వ కృషిని గొప్పగా తెలియజేయాలి.మల్కపేట జలాశయం ట్రయల్ రన్ విజయవంతం అయిన విషయాన్ని తెలియజేయాలి.

దాని ప్రాధాన్యతను తెలియజేయాలి.

జూన్ 8 వ తేది – గురువారం: ఊరూరా చెరువుల పండుగ •గ్రామ పంచాయతీలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పెద్ద చెరువు వద్ద సాయంత్రం 5 గంటలకు చెరువుల పండుగ నిర్వహించాలి.గ్రామం నుంచి డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్యకారుల వలలతో ఊరేగింపుగా బయలుదేరాలి.గ్రామంలోని రైతులు, మత్స్యకారులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు చెరువు కట్టకు చేరుకోవాలి.

చెరువు గట్టుపై పండుగ వాతావరణం ప్రతిఫలించేలా ముగ్గులు, తోరణాలతో అందంగా అలంకరించాలి.కట్ట మైసమ్మపూజ చెరువు నీటికి పూజ చేయాలి.

తదనంతరం సభ, సాంస్కృతిక కార్యక్రమాలు- బతుకమ్మ, కోలాటాలు-పాటలు, గోరేటి వెంకన్న రాసిన చెరువోయి.మా ఊరి చెరువు తదితర చెరువు పాటలు వినిపించాలి.

ఇరిగేషన్ లో వచ్చిన ప్రగతి, తద్వారా పెరిగిన పంటల ఉత్పత్తి వివరాలు, మత్స్య సంపద, భూగర్భ జలాల పెరుగుదల.తదితర వివరాలను తెలియజేస్తూ, ఫ్లెక్సీలు పెట్టాలి.

పాంప్లెట్లు పంచాలి, చదివి వినిపించాలి.నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేయాలి.

(కార్యక్రమ సమన్వయ అధికారులు :ఈఈ ఇరిగేషన్, జిల్లా మత్య్స అధికారి)

జూన్ 9 వ తేది – శుక్రవారం: తెలంగాణా సంక్షేమ సంబురాలు

•సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా ఫించన్లు, కళ్యాణ లక్ష్మి లబ్దిదారులతో 1,000 మందికి తగ్గకుండా పాల్గొనేలా సభ నిర్వహించాలి.ఆ నియోజకవర్గంలో ఎంతమంది ఫించన్లు, కళ్యాణ లక్ష్మి, తదితర సంక్షేమ పథకాల లబ్ది పొందారు, ఇందుకోసం ఎన్ని నిధులు వెచ్చించారు, దాని ఫలితాల గురించి వివరించాలి.

తాము పొందిన లబ్ది గురించి, లబ్దిదారుల చేత మాట్లాడించాలి.(కార్యక్రమ సమన్వయ అధికారి :జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి) జూన్ 10 వ తేది – శనివారం:తెలంగాణా సుపరిపాలన దినోత్సవం

పరిపాలన సంస్కరణలు, ఫలితాలు జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును ప్రముఖంగా ప్రస్తావించాలి.ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అందరినీ భాగస్వామ్యం చేయాలి.కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలు, మండలాలు, రెవిన్యూ డివిజన్లు, తదితర వివరాలతో కరపత్రం తయారు చేసి పంపిణీ చేయాలి.

వీటివల్ల ప్రజలకు దూరభారం తగ్గడమే కాకుండా, పరిపాలన పరమైన పర్యవేక్షణ సులభతరమైన విషయాన్ని పేర్కొనాలి.వివిధ శాఖలను పునర్ వ్యవస్థీకరణ చేయడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతున్న విషయాన్ని వివరించాలి.

ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ, హెల్త్, విద్యుత్తు, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల పునర్ వ్యవస్థీకరించిన తీరుతెన్నులను, తద్వారా పరిపాలన సుగమమై ప్రజలకు చక్కని సేవలు అందుతున్న విధానాన్ని, వీటి ప్రభావంతో ప్రజాజీవితంలో వచ్చిన మెరుగుదలపై నివేదిక తయారు చేయాలి.స్థానిక ఎమ్మెల్యే భాగస్వామ్యంతో నూతనంగా ఏర్పడిన మండలాల్లో సంబురాలు జరిగేలా చూడాలి.

జూన్ 11 వ తేది – ఆదివారం : తెలంగాణా సాహిత్య దినోత్సవం

జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు సిరిసిల్లలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో తెలంగాణ గంగాజమునా తెహజీబ్ ప్రతిబింబించేలా ఉర్దూ, తెలుగు కవులచే జిల్లా స్థాయి కవి సమ్మేళనం నిర్వహించాలి.పాల్గొన్న కవులకు ప్రశంసాపత్రాలను అందజేయాలి.

ఈ కార్యక్రమాల్లో తెలంగాణ కవులు, సాహిత్యాభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలి.తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా కవితలు ఉండాలి.

జిల్లాస్థాయి కవి సమ్మేళనంలో చదివిన కవితలతో కవితా సంకలనాన్ని ప్రచురించాలి.

జూన్ 12 వ తేది – సోమవారం: తెలంగాణ రన్ •తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమం నిర్వహించాలి.ఈ రన్ కార్యక్రమం పోలీసు శాఖ నేతృత్వంలో నిర్వహించాలి.క్రీడలు, యువజన సర్వీసుల శాఖ భాగస్వామ్యాన్ని పంచుకోవాలి.ఈ సందర్భంగా ప్రత్యేకంగా బెలూన్స్ ఎగురవేయాలి.
(కార్యక్రమ సమన్వయ అధికారులు :సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, జిల్లా యువజన&క్రీడాధికారి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి)

జూన్ 13 వ తేది – మంగళవారం :తెలంగాణా మహిళా సంక్షేమ దినోత్సవం •సిరిసిల్ల లో మరియు వేములవాడ నియోజకవర్గ కేంద్రాల్లో మహిళా సదస్సు నిర్వహించాలి.ఈ సదస్సులో అంగన్వాడీ టీచర్లు, సెర్ప్ సిబ్బంది, ఇతరులు మొత్తం 1000 మందికి తగ్గకుండా పాల్గొనేలా చూడాలి.మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరించాలి.

బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, ఆరోగ్య లక్ష్మి, కేసిఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య మహిళ, పోలీస్ శాఖలో 33% రిజర్వేషన్, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్, మహిళలకు విఎల్ఆర్, షీ టీమ్స్, వి హబ్ ఏర్పాటు, మహిళా ఉద్యోగిణీలకు ప్రసూతి సెలవులు పెంచిన విషయం తదితర విషయాలను ఘనంగా పేర్కొనాలి.ఆరోగ్య లక్ష్మి, బాలింతలకు, గర్భిణీలకు పాలు, గుడ్లు తో కూడిన పౌష్టికాహారం అందించే విషయాన్ని తెలియజేయాలి.

సఖి కేంద్రాల ద్వారా మహిళలకు రక్షణ, భరోసా, ఎస్ హెచ్ జి ల ద్వారా ఆర్థిక సహాయము, అంగన్వాడీలకు, ఆశా వర్కర్లకు ఇతర మహిళలకు వేతనాలు పెంచిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి.మహిళా డిగ్రీ కళాశాలలను విరివిగా ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించాలి.

మహిళలతో ఎక్కువగా మాట్లాడించాలి.అంగన్వాడీలు పోషక లోపం పై కృషి చేసిన వారికి, ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేయాలి.

పని ప్రదేశంలో రక్షణ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూల్స్, పాఠశాలల గురించి వివరించాలి.ఈ సమావేశంలో మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనేలా చూడాలి.

జూన్ 14 వ తేది – బుధవారం:తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం •నియోజకవర్గ స్థాయిలో కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్, సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, నూతన మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీల విద్యార్థులు తదితరులను ఆహ్వానించి సభ నిర్వహించాలి.ఇందులో వైద్యారోగ్య రంగంలో తెలంగాణ సాధించిన అద్భుత ప్రగతిని పేర్కొనాలి.33మెడికల్ కాలేజీలు, బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలు, కంటి న్యూట్రీషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు, ఎంసీహెచ్ లు, మాతా శిశు సంరక్షణ సేవలు, పెరిగిన మౌలిక వసతులు వంటి పూర్తి వివరాల గురించి వివరించాలి.జిల్లాలో వైద్యారోగ్య రంగంలో సాధించిన సంపూర్ణ ప్రగతిని తెలియజేస్తూ, ఆ శాఖ ఒక కరపత్రాన్ని రూపొందించి జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయాలి.

•అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయాలి.ఉత్తమ ఆశా వర్కర్, ఉత్తమ ఏఎన్ఎం, ఉత్తమ స్టాఫ్ నర్స్, ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్, ఉత్తమ డాక్టర్లకు సన్మానం చేయాలి.

అవార్డులు అందించాలి.స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల గురించి తెలియజేయాలి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎన్క్వాస్ గుర్తింపు వచ్చిన విషయం తెలపాలి.(కార్యక్రమ సమన్వయ అధికారులు :జిల్లా వైద్యారోగ్య అధికారి, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు)

జూన్ 15 వ తేది – గురువారం తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం

•ప్రతి గ్రామ పంచాయతీ ముందు జాతీయ జెండా ఎగురవేయాలి.అనంతరం పల్లె ప్రగతి ద్వారా, గ్రామానికి వచ్చిన నిధుల వివరాలను, వివిధ సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు జరిగిన లబ్ధిని, గ్రామంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ప్రకటించాలి.గ్రామ పారిశుద్ధ్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును వివరించాలి.

జాతీయస్థాయిలో సాధించిన అవార్డుల వివరాలను తెలియజేయాలి.నాడు – నేడు ఫార్మాట్ లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమానికి మరియు పంచాయతీరాజ్ ద్వారా వస్తున్న నిధుల వివరాలతో ఊరూరా ఫ్లెక్సీలు పెట్టాలి.

ఊరిలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూ ఫ్లెక్సీలు పెట్టాలి.ఫొటోలతో బ్రోచర్ల మాదిరిగా తయారుచేసి పంచాలి.

జూన్ 16 వ తేది – శుక్రవారం : తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం •జిల్లాలోని మున్సిపాలిటీల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయాలి.అనంతరం పట్టణ ప్రగతి ద్వారా, పట్టణానికి వచ్చిన నిధుల వివరాలను, వివిధ సంక్షేమ పథకాల ద్వారా పట్టణ ప్రజలకు జరిగిన లబ్ధిని, పట్టణంలో నిర్మించిన మౌలిక వసతుల వివరాలను ప్రకటించాలి.

పట్టణ పారిశుద్ధ్యం, పచ్చదనం గణనీయంగా మెరుగుపడిన తీరును వివరించాలి.జాతీయ స్థాయిలో పట్టణాభివృద్ధిలో సాధించిన అవార్డుల వివరాలను తెలియజేయాలి.పట్టణాల్లో నిర్మించిన సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల గురించి, వైకుంఠధామాల నిర్మాణం గురించి, డంప్ యార్డుల గురించి, అర్బన్ ఫారెస్ట్, పార్కుల నిర్మాణం, 10 శాతం గ్రీన్ బడ్జెట్ గా కేటాయించడం తదితర అభివృద్ధి అంశాల గురించి ప్రస్తావించాలి.నాడు నేడు ఫార్మాట్ లో పట్టణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి గురించి, ప్రజా సంక్షేమానికి మరియు పురపాలక శాఖ ద్వారా వస్తున్న నిధుల వివరాలతో పట్టణాల్లో ఫ్లెక్సీలు పెట్టాలి.

ఫొటోలతో బ్రోచర్ల మాదిరిగా తయారుచేసి పంచాలి.దేశానికి దిక్సూచి టీఎస్ బి పాస్ చట్టం తీసుకొచ్చిన సంగతి, తద్వారా సులువైన నిర్మాణ అనుమతుల ప్రక్రియ వంటి అంశాలను హైలైట్ చేయాలి.

జీవో 58, 59 తదితర జీవోల ద్వారా పేద ప్రజలు నిర్మించుకున్న ఇండ్లకు పట్టాలు అందజేసిన విధానం గురించి ప్రముఖంగా ప్రస్తావించాలి.ఉత్తమ మున్సిపాలిటీ, వార్డు కౌన్సిలర్లకు, చైర్ పర్సన్లకు, ఉద్యోగులకు సన్మానం చేయాలి.

జూన్ 17 వ తేది – శనివారం :___తెలంగాణ గిరిజనోత్సవం •ఆయా గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహించాలి.గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించాలి.

గిరిజనుల చిరకాల వాంఛను తీరుస్తూ తండాలకు, గూడాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించిన తీరును, విద్య, ఉద్యోగాల్లో ఎస్టీల రిజర్వేషన్ 10 శాతం ప్రముఖంగా ప్రస్తావించాలి.హైదరాబాద్ లో బంజారా భవన్, ఆదివాసి భవన్ నిర్మాణం చేసిన విషయం హైలైట్ చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube