రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు వీర్నపల్లి మండల పరిషత్ అధికారులు విద్యాలయాల ఆవరణలో పలు పనులు చేపట్టారు.వీర్నపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Sandeep Kumar Jha) ఇటీవల ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో(Kasturba Gandhi Girls’ School) ఆవరణ, బయట సోలార్ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, ఆవరణ అంతా పరిశుభ్రంగా చేయించాలని మండల పరిషత్ అధికారులను ఆదేశించారు.అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పెరిగిన గడ్డి, చెత్తాచెదారని తొలగించాలని సూచించారు.
దీంతో ఎంపీడీవో రఘురాం, ఎంపీఓ వాజిద్ విద్యాలయాల్లో పనులు పూర్తి చేశారు.