చెరుకు రసం. పేరు వింటేనే నోరూరుతుంటుంది.
మధురమైన రుచిని కలిగి ఉండే చెరుకు రసంలో పోషకాలు మెండుగా నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యానికి చెరుకు రసం బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
అందులోనూ ప్రస్తుత సమ్మర్ సీజన్‌లో రోజుకో గ్లాస్ చెరుకు రసం తాగితే.వివిధ రోగాలకు దూరంగా ఉండొచ్చని పోషకాహార నిపుణులు చెబుతుంటారు.
అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు.చర్మ సౌందర్యానికి కూడా చెరుకు రసం ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా స్కిన్ టోన్ ను పెంచుకోవాలని ఆరాటపడుతున్న వారికి చెరుకు రసం అద్భుతంగా సహాయపడుతుంది.మరి లేటెందుకు చెరుకు రసాన్ని చర్మానికి ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ చెరుకు రసం పోయాలి.అలాగే అందులో నాలుగు టేబుల్ స్పూన్ల పంచదార వేసి ఐదు నుంచి పది నిమిషాల పాటు స్పూన్‌తో తిప్పుకుంటూ మరిగించుకోవాలి.
ఇలా మరిగించుకున్న చెరుకు రసాన్ని కాస్త చల్లార బెట్టుకుని.అప్పుడు అందులో రెండు మూడు స్పూన్ల గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పాలను వేసుకుని మరోసారి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని.ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఈ సింపుల్ రెమెడీని రెండు రోజులకు ఒకసారి ట్రై చేస్తే స్కిన్ టోన్ రెట్టింపు అవుతుంది.చర్మంపై పేరుకుపోయిన మలినాలు, మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా, షైనీగా కూడా మెరుస్తుంది.
కాబట్టి, చెరుకు రసం అందుబాటులో ఉంటే తప్పకుండా ఈ రెమెడీని ట్రై చేసేందుకు ప్రయత్నించండి.