ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!

మనదేశంలో ఆ పరమశివుడికి జ్యోతిర్లింగాలు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు.ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలలో సాక్షాత్తు ఆ పరమశివుడు స్వయంభుగా వెలసి కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం.

 Facts-about Omkareshwara Jyotirlinga Temple Omkareshwara, Jyotirling Temple, Shi-TeluguStop.com

అలాంటి పవిత్రమైన జ్యోతిర్లింగాలలో మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరాన ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఒకటి.మన దేశంలోని అన్ని నదులు కూడాతూర్పు వైపుగా ప్రవహించి సముద్రగర్భంలో కలిస్తే ఒక నర్మదా నది మాత్రం పశ్చిమ వైపు ప్రయాణించి సముద్రంలో కలుస్తుంది.

ఈ నర్మదా నది రెండు పాయలుగా చీలి నర్మద, కావేరి నదిగా ఏర్పడ్డాయి.ఈ నదీ తీరాన వెలసిన ఈ జ్యోతిర్లింగానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ఆలయ విశిష్టత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

నర్మదా నది రెండు పాయలుగా చీలి నర్మద, కావేరి నదులుగా ప్రవహిస్తున్నాయి.ఈ రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని శివపురిగా పిలుస్తారు.నర్మదానది రెండు కొండల మధ్య ప్రవహిస్తూ ఎంతో అందంగా ఉంటుంది.ఈ నర్మదానదిని పైనుంచి చూస్తే మనకు ఓం అనే ఆకారంలో ఈ నది కనిపించడం వల్ల ఆ ప్రాంతంలో వెలసిన స్వామి వారికి ఓంకారేశ్వరుడు అనే పేరును పెట్టారు.

ఈ ఓంకారేశ్వర ఆలయంలోనే ఆదిశంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం రాశారు.

Telugu Temple, Narmada Nadi, Omkareshwara, Shiva-Telugu Bhakthi

ఈ ఓంకారేశ్వర ఆలయంలో స్వామి వారి శివలింగం పై అభిషేకం చేసేటటువంటి నీరు లింగం పై ఉన్న చీలిక ద్వారా ఆ అభిషేక జలం నర్మదా నదిలో కలుస్తుంది.ఈ విధంగా నర్మదా నది ఎంతో పవిత్రతను సంతరించుకుందని అక్కడి ప్రజలు ఎంతో విశ్వసిస్తారు.అందుకే నర్మదా నది నీటిని ఎంతో పవిత్రమైన తీర్థంగా భక్తులు భావిస్తారు.

ఈ ఆలయంలో ఉన్నటువంటి గౌరీ సోమనాథ శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల పునర్జన్మ ఉంటుందని, రాబోయే జన్మ రహస్యాలు సైతం తెలుస్తాయని భక్తులు నమ్మకం.ఈ జ్యోతిర్లింగ దర్శనార్థం భక్తులు పెద్దఎత్తున ఈ ఆలయానికి తరలి వస్తుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube