ఈ ఒక్క రెమెడీతో అన్ని జుట్టు సమస్యలను నివారించుకోవ‌చ్చు..

అందాన్ని పెంచే వాటిలో జుట్టు( Hair ) ఒకటి.జుట్టు ఒత్తుగా, పొడుగ్గా మరియు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తూ ఉంటే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు.అందుకే ఇటువంటి జుట్టును పొందడానికి మగువలు తహతహలాడుతుంటారు.కానీ ఎప్పుడూ ఏదో ఒక జుట్టు సమస్య వేధిస్తూ ఉంటుంది.చుండ్రు( Dandruff ), హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్( Hair Growth ) లేకపోవడం, జుట్టు చిట్లడం, విరగడం డ్రై గా మారడం తదితర సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

అయితే ఈ సమస్యల‌న్నిటినీ ఒక్క రెమెడీతో నివారించుకోవ‌చ్చు.

మరి ఆ రెమెడీ ఏంటి అనేది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో ఐదు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice ) వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో రైస్ వాటర్ ను సపరేట్ చేసుకోవాలి.

Telugu Dandruff, Dry, Care, Care Tips, Fall, Pack, Problems, Latest-Telugu Healt

ఈ రైస్ వాటర్ పూర్తిగా చల్లారే లోపు ఒక అలోవెరా ఆకు( Aloevera )ను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్క‌ల‌ను మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల షికాకై పౌడర్, నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జ్యూస్, సరిపడా రైస్ వాటర్( Rice Water ) ను వేసుకుని అన్నీ కలిసేలా స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Dandruff, Dry, Care, Care Tips, Fall, Pack, Problems, Latest-Telugu Healt

రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.అదే సమయంలో కురులకు చక్కని పోషణ అందుతుంది.హెయిర్ గ్రోత్ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.కేశాలు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతాయి.తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది.

చుండ్రు సమస్య దూరం అవుతుంది.ఎండు గడ్డి మాదిరిగా మారిన జుట్టు స్మూత్ అండ్ షైనీ( Smooth and Shiny hair ) గా తయారవుతుంది.

జుట్టు చిట్లడం విరగడం వంటివి సైతం అదుపులోకి వస్తాయి.మీ జుట్టు ఒత్తుగా, పొడుగ్గా మరియు నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube