రాజన్నా సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి ఆవరణలో ఇల్లంతకుంట గ్రామ శాఖ గౌడ సంఘం ఆద్యక్షునిగా కొయ్యాడ రాజయ్య, ఉపాధ్యక్షునిగా అంతటి రమేష్, ప్రధాన కార్యదర్శిగా బండారి శ్రీనివాస్,కోశాధికారిగా ముంజ భాస్కర్, డైరెక్టర్లుగా కొయ్యాడ లింగయ్య, సుదగోని నాగేంద్రం, వొళ్లాల రాజు, గైని శ్రీకాంత్, అంతటి రవి, బొంగోని అనిల్, అంతటి రాజయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించడం జరిగింది.
ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమ ఎన్నికకు సహకరించి, తమపై నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నందుకు మావంతు బాధ్యతలు నిర్వార్తిస్తామని ఈ సందర్బంగా చెప్పడం జరిగింది.